రిసెప్ష‌న్‌లో ఆ ఇద్ద‌రి పాదాల‌కు న‌మ‌స్క‌రించిన లావ‌ణ్య త్రిపాఠి | Lavanya Tripathi Touches Chiranjeevi, Satyanand Feet in Her Reception | Sakshi
Sakshi News home page

Lavanya Tripathi: ఆ ఇద్ద‌రి కాళ్లు మొక్కిన లావ‌ణ్య‌.. అభిమానులు ఫిదా!

Published Mon, Nov 6 2023 1:57 PM | Last Updated on Mon, Nov 6 2023 2:52 PM

Lavanya Tripathi Touches Chiranjeevi, Satyanand Feet in Her Reception - Sakshi

 బంగారు వ‌ర్ణం చీర‌లో మెరిసిన ఆమె నుదుట‌న సింధూరం పెట్టుకుంది. కేవ‌లం ఫోటోల‌కు ఫోజులివ్వ‌డ‌మే కాకుండా పెద్ద‌వాళ్ల‌పై త‌న‌కున్న గౌర‌వాన్ని చాటుకుంది. త‌న‌

ఆర‌డుగుల అంద‌గాడు వ‌రుణ్ తేజ్‌, అందాల రాక్ష‌సి లావ‌ణ్య త్రిపాఠి జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. మొన్న‌టివ‌ర‌కు ప్రేమ‌లో మునిగి తేలిన ఈ జంట న‌వంబ‌ర్ 1న వైవాహిక బంధంలో అడుగుపెట్టింది. వేద‌మంత్రాల సాక్షిగా నిండు నూరేళ్లు లావ‌ణ్య చేయి వ‌ద‌ల‌నంటూ ఆమె మెడ‌లో మూడు ముళ్లు వేశాడు వ‌రుణ్ తేజ్‌. ఇట‌లీలో అత్యంత ద‌గ్గ‌రి బంధుమిత్రుల స‌మ‌క్షంలో వీరి వివాహం జ‌రిగింది.

పెద్ద‌వాళ్ల‌పై గౌర‌వం చాటుకున్న లావ‌ణ్య‌
టాలీవుడ్ సెల‌బ్రిటీలు, స్నేహితుల కోసం న‌వంబ‌ర్ 5న గ్రాండ్‌గా రిసెప్ష‌న్ ఏర్పాటు చేశాడు. మెగా ఇంటి ఫంక్ష‌న్ అంటే ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. క‌ళ్లు జిగేల్‌మ‌నేలా అంగ‌రంగ వైభ‌వంగా రిసెప్ష‌న్ వేడుక జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో లావ‌ణ్య త్రిపాఠి సింపుల్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చింది. బంగారు వ‌ర్ణం చీర‌లో మెరిసిన ఆమె నుదుట‌న సింధూరం పెట్టుకుంది. కేవ‌లం ఫోటోల‌కు ఫోజులివ్వ‌డ‌మే కాకుండా పెద్ద‌వాళ్ల‌పై త‌న‌కున్న గౌర‌వాన్ని చాటుకుంది. త‌న‌ పెద్ద‌మామ‌య్య‌ మెగాస్టార్ చిరంజీవి పాదాల‌కు న‌మ‌స్క‌రించి ఆశీర్వాదం తీసుకుంది.

మెగా గురువుకి పాదాభివంద‌నం
అలాగే న‌ట‌గురువు స‌త్యానంద్ కాళ్లు మొక్కింది. ఈయ‌న టాలీవుడ్‌లో ఎంతోమంది హీరోల‌కు న‌ట‌న‌లో మెళ‌కువ‌లు నేర్పించారు. వ‌రుణ్ తేజ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్‌.. ఇలా ప‌లువురికీ న‌ట‌న‌లో శిక్ష‌ణ ఇచ్చారు. 100 మందికి పైగా హీరోల‌ను త‌యారు చేశారు. ఈయ‌నంటే మెగా కుటుంబానికే కాదు చాలామంది స్టార్ హీరోల‌కు గౌర‌వం. అందుకే ఆ పెద్దాయ‌న రాగానే లావ‌ణ్య ఏమాత్రం సంకోచించ‌కుండా స‌త్యానంద్ పాదాల‌కు న‌మ‌స్క‌రించింది. ఆమె విన‌యం, విధేయత‌ చూసిన అభిమానులు తెలుగింటి కోడ‌లిగా లావ‌ణ్య నూటికి నూరు మార్కులు కొట్టేసింద‌ని, ఆమె బంగారం అని కొనియాడుతున్నారు.

చ‌ద‌వండి: ఈ వారం ఓటీటీల ఏకంగా 23 సినిమాలు రిలీజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement