
వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ పైలట్‌గా నటిస్తున్న చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. రాడార్ ఆఫీసర్ పాత్రలో మానుషీ చిల్లర్ నటిస్తున్నారు. శక్తీ ప్రతాప్ సింగ్ హడాని దర్శకునిగా పరిచయం చేస్తూ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రోడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ పై సందీప్ ముద్దా నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. తెలుగు, హిందీ భాషల్లో 2024 ఫిబ్రవరి 16న చిత్రాన్ని, త్వరలో టీజర్‌ను విడుదల చేయనున్నట్లు సోమవారం యూనిట్ ప్రకటించింది.
ఈ సందర్భంగా వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్ ఒక అతి పెద్ద వైమానిక దాడిని ఎదుర్కోడానికి సిద్ధం అయ్యే విజువల్స్‌ని గ్లింప్స్‌గా విడుదల చేశారు. ‘‘దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మన వైమానిక దళ వీరుల అసమానమైన ధైర్య సాహసాలను, దేశాన్ని రక్షించడానికి వారు ఎదుర్కొంటున్న సవాళ్లను చూపిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాతలు: నందకుమార్ అబ్బినేని, వకీల్ ఖాన్.
Comments
Please login to add a commentAdd a comment