మంచి కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. అలాంటి మంచి కంటెంట్‌తో వస్తున్న ‘కలి’ సినిమాకు ఆడియన్స్ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను’అని అన్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా "కలి". ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్ మాట్లాడుతూ.. ‘ప్రిన్స్ నాకు క్లోజ్ ఫ్రెండ్. డెడికేషన్ ఉన్న నటుడు. హీరోగా చేస్తూనే మంచి రోల్స్ వస్తే డీజే టిల్లు, స్కంధ లాంటి మూవీస్ లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. అలాంటి క్యారెక్టర్స్ తో ప్రిన్స్ కు మంచి గుర్తింపు వచ్చింది. నా మూవీస్ లో కూడా ప్రిన్స్ నటించాడు. ప్రిన్స్ ఈ సినిమా గురించి నాకు చాలా ఎగ్జైటింగ్ గా చెప్పాడు. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాను ఆదరించాలని కోరుతున్నాను’అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో అల్లరి నరేశ్, ప్రియదర్శి, ఆకాశ్ జగన్నాథ్‌తో చిత్రబృందం పాల్గొంది.
కథ కొత్తగా అనిపించింది: కె. రాఘవేంద్ర రెడ్డి
‘‘కరోనా ప్యాండమిక్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి. మన దేశంలో కూడా ఎక్కవగానే ఉన్నాయంటున్నారు. అయితే ఆత్మహత్య ప్రయత్నం చేసే వ్యక్తిని ఎవరైనా అడ్డుకుని, వారి ఆత్మహత్య ఆలోచనను దూరం చేస్తే బాగుంటుంది. ఈ పాయింట్‌తో ‘కలి’ కథను శివ శేషు రాసుకున్నాడు. కథ విన్నప్పుడు కొత్తగా అనిపించింది. అందుకే సమర్పకుడిగా వ్యవహరించాను’’ అని అన్నారు కె. రాఘవేంద్ర రెడ్డి.
ప్రిన్స్, నరేష్ అగస్త్య లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘కలి’. శివ శేషు దర్శకత్వంలో కె. రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో లీలా గౌతమ్ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో కె. రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ– ‘‘జీవితంలోని సమస్యలను ఎదుర్కోలేక ఆత్మహత్య చేసుకుందామనుకున్న శివరాజ్ జీవితంలోకి ఓ అపరిచిత వ్యక్తి రావడం వల్ల ఏం జరిగింది? అన్నదే ఈ చిత్రకథ. దర్శకుడు శివ శేషు ప్రతిభావంతుడు. అతనికి పురాణాల మీద పట్టు ఉంది. కలి అతనికి మంచి పేరు తెచ్చిపెడుతుంది. ప్రస్తుతం నేను రెండు కథలు రాస్తున్నాను’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment