వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మట్కా’. ‘పలాస’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో రూపోందుతున్న ఈ సినిమాలో నోరా ఫతేహి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లు. రజనీ తాళ్లూరి ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. యావత్ భారతదేశాన్ని కదిలించిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా డిఫరెంట్ టైమ్‌లైన్స్‌లో సాగే ఈ సినిమాలో వరుణ్ తేజ్ నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారు.
కాగా కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమా షూటింగ్ మళ్లీ ఆరంభం కానుంది. తాజా షెడ్యూల్ చిత్రీకరణను ఈ నెల 19న హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఓ స్టూడియోలో ప్లాన్ చేశారు. ప్రస్తుతం సెట్ వర్క్ జరుగుతోంది. కొత్తగా ప్రారంభం కానున్న షూటింగ్ షెడ్యూల్‌లో ఓ యాక్షన్ ఎపిసోడ్‌తో పాటు ప్రధాన తారాగణంపై కొంత టాకీ పార్టును కూడా చిత్రీకరిస్తారట మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్.
Comments
Please login to add a commentAdd a comment