మట్కా,కంగువా ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. వరుణ్‌ కెరీర్‌లోనే భారీ డిజాస్టర్‌ | Matka And Kanguva Movie First Day Collection | Sakshi
Sakshi News home page

మట్కా,కంగువా ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. వరుణ్‌ కెరీర్‌లోనే భారీ డిజాస్టర్‌

Published Fri, Nov 15 2024 6:55 PM | Last Updated on Fri, Nov 15 2024 7:17 PM

Matka And Kanguva Movie First Day Collection

టాలీవుడ్‌ హీరో వరుణ్‌ తేజ్‌ జయాపజయాలతో సంబంధం లేకుండా కథ నచ్చితే ఓకే చెప్పేస్తాడు. భారీ అంచనాలతో ఆయన నటించిన 'మట్కా' చిత్రం నవంబర్‌ 14న విడుదలైంది. అయితే, ఈ సినిమా మొదటి ఆటతోనే డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకోవడంతో  ఆ ప్రభావం కలెక్షన్లపై పడింది. వరుణ్‌ కెరియర్‌లోనే అత్యంత తక్కువ కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రంగా 'మట్కా' రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

'పలాస' సినిమాతో మెప్పించిన కరుణ కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. విజయేందర్‌ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సుమారు రూ. 40 కోట్లతో ఈ మూవీని నిర్మించారు. 'మట్కా' టీజర్, ట్రైలర్‌తో  ఆకట్టుకునేలా ఉండటం, వరుణ్‌ భిన్నమైన గెటప్పుల్లో కనిపించడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల దృష్టి పడింది. అయితే, కథలో కొత్తదనం లేకపోవడంతో పాటు ఆసక్తిరేకెత్తించే  సీన్స్ పెద్దగా సినిమాలో కనిపించలేదు. దీంతో 'మట్కా' మొదటిరోజు కేవలం రూ. 70 లక్షలు మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమాతో నిర్మాతలకు భారీ నష్టాలు తప్పవని తెలుస్తోంది. ఇదే ట్రెండ్‌ కొనసాగితే కనీసం రూ. 2 కోట్లు అయినా రావడం కష్టమని  చెప్పవచ్చు.

కంగువా కలెక్షన్స్‌
సూర్య, దిశా పటానీ జోడీగా నటించిన చిత్రం 'కంగవ'. బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా సత్తా చాటింది. సినిమాకు డివైడ్‌ టాక్‌ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపించింది. దర్శకుడు శివ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కేఈ జ్ఞానవేల్‌ రాజా, వంశీ, ప్రమోద్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ మూవీ నవంబర్‌ 14న విడుదలైంది. అయితే, కంగువా మొదటిరోజు రూ. 58.62 కోట్లు రాబట్టినట్లు అధికారికంగా మేకర్స్‌ ప్రకటించారు. కానీ ఈ సినిమా కోసం రూ.350 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తుంది. ఇదే నిజమైతే కంగువా నిర్మాతలకు కూడా భారీగా నష్టాలు తప్పవని చెప్పవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement