
వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నోరా ఫతేహి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక మాస్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. వైర ఎంటర్‌టైన్మెంట్స్, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్‌పై డా. విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో నవంబరు 14న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
'లే లే రాజా' అంటూ సాగే ఈ పాటను భాస్కరభట్ల రచించగా నీతీ మోహన్ ఆలపించారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘మట్కా’ రూపొందుతోంది. 1958 నుంచి 1982 వరకు 24 ఏళ్ల బ్యాక్‌డ్రాప్‌తో పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను కరుణ కుమార్ ఎంచుకున్నారు. వరుణ్ తేజ్‌ని నాలుగు డిఫరెంట్ లుక్స్‌లో అద్భుతంగా చూపిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment