
టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్‌తేజ్- లావణ్య త్రిపాఠి వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. ఇన్నాళ్లు ప్రేమపక్షులుగా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వీరు భార్యాభర్తలుగా ప్రమోషన్ పొందారు. మిస్టర్ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ మూవీ చిత్రీకరణ ఎక్కువ భాగం ఇటలీలోనే జరిగింది. అందుకే.. వారి ప్రేమకు బీజం పడ్డ ఇటలీలోనే నవంబర్ 1న అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. మెగా, అల్లు కుటుంబాలు పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
భారీగా ఖర్చు పెట్టిన మెగా ఫ్యామిలీ
అయితే ఎంతో ఘనంగా జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వివాహం కోసం మెగా ఫ్యామిలీ భారీగానే ఖర్చు చేసిందట. కాక్‌టైల్, హల్దీ, మెహందీ, పెళ్లి.. ఇలా ప్రతి వేడుకను గ్రాండ్‌గా ఉండేలా ముందుగానే ప్లాన్ చేసుకున్నారట. ఈ పెళ్లి తమ కుటుంబానికే కాకుండా వచ్చిన అతిథులందరికీ గుర్తుండిపోయేలా నిర్ణయించుకున్నారట. అందుకే ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా ఎక్కడా ఏ లోటు రాకుండా ఏర్పాట్లు చేశారట.
పెళ్లికి అన్ని కోట్లా?
సోషల్ మీడియాలో వినిపిస్తున్న లెక్కల ప్రకారం.. ఈ పెళ్లి కోసం ఏకంగా రూ.15-17 కోట్ల మేర ఖర్చు చేశారట. విదేశాల్లో జరిగిన పెళ్లికే ఈ రేంజ్‌లో ఖర్చు పెడితే.. హైదరాబాద్‌లో జరిగే రిసెప్షన్‌ను ఇంకెంత భారీగా ఏర్పాటు చేస్తారోనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయినా నాగబాబుకు ఒక్కగానొక్క కొడుకు కావడంతో వరుణ్ పెళ్లికి ఈ మాత్రం ఖర్చు చేయడంలో తప్పే లేదంటున్నారు అభిమానులు. వరుణ్-లావణ్యల రిసెప్షన్ నవంబర్ 5న హైదరాబాద్‌లో జరగనుంది.
చదవండి: Jr NTR: ఆహ్వానం అందినా వరుణ్- లావణ్యల పెళ్లికి హాజరు కాని జూనియర్ ఎన్టీఆర్!
Comments
Please login to add a commentAdd a comment