
యాత్ర సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులను థియేటర్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు.
సాక్షి, తిరుపతి : దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితం ఆధారంగా మహి వి.రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన యాత్ర సినిమాపై ఏపీ పోలీసులు జులుం ప్రదర్శించారు. తిరుపతిలోని పలని థియేటర్ వద్ద మంగళవారం ఓవర్ యాక్షన్ చేశారు. ఈ సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులను థియేటర్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. టీడీపీ నేతల ఒత్తిడికి తలొగ్గిన పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ప్రేక్షకులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 8న రిలీజైన ‘యాత్ర’కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. విడుదలైన అన్ని కేంద్రాల్లో భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా పలు చోట్ల ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. వైఎస్సార్ పాత్రలో మళయాల మెగాస్టార్ మమ్ముట్టి ఆకట్టుకున్నారు.