
మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్ యాత్ర సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే వైఎస్‌ఆర్ కథతో తెరకెక్కిన యాత్ర సినిమా రేపు (శుక్రవారం) థియేటర్లలో రిలీజ్ అవుతుండగా నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన యన్.టి.ఆర్ కథానాయకుడు రేపే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది.
క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన యన్.టి.ఆర్ కథానాయకుడుకి డివైడ్ టాక్ రావటమే కాదు కలెక్షన్ల పరంగా కూడా తీవ్రంగా నిరాశపరచింది. దీంతో రెండో భాగం యన్.టి.ఆర్ మహానాయకుడు రిలీజ్‌పై చిత్రయూనిట్ ఆలోచనలో పడిందన్న ప్రచారం జరుగుతోంది. మహానాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన యాత్ర సినిమాకు మహి వీ రాఘవ్ దర్శకుడు.
Stream #NTRKathanayakudu from tomorrow on @PrimeVideoIN.#NandamuriBalakrishna @vidya_balan @DirKrish @RanaDaggubati @iSumanth @NBKFilms_ @VaaraahiCC @vishinduri @mmkeeravaani @sahisuresh @gnanashekarvs @USTelugu @LahariMusic pic.twitter.com/gviz10SxUA
— NBK FILMS (@NBKFilms_) 7 February 2019