వైఎస్‌ఆర్ బయోపిక్ యాత్రలో టైటిల్ రోల్ పోషిస్తున్న మమ్ముట్టి
సాక్షి, హైదరాబాద్ : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా దిగ్గజ నేతపై రూపొందుతున్న బయోపిక్ ‘యాత్ర’ యూనిట్ సమరశంఖం అంటూ సాగే పూర్తి సాంగ్ లిరిక్స్‌ను లాంఛ్ చేసింది. వేలాది మంది వెంటరాగా మహానేత పాదయాత్రగా ప్రజాక్షేత్రంలోకి వడివడిగా వెళుతున్న దృశ్యాలు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.
‘నీ కన్నుల్లో కొలిమై రగిలే..కలేదో నిజమై తెలవారెనే.. వెతికే వెలుగే రానీ.ఈనాటి సుప్రభాత గీతమే..నీకిదే అన్నది స్వాగతం’ అంటూ సాగే ఈ పాట ఆనాటి చారిత్రాత్మక యాత్రను కళ్లకుకట్టేలా ఉంది. మళయాళ మెగాస్టార్ మమ్ముటీ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రం ఆనందోబ్రహ్మ ఫేమ్ మహి వీ రాఘవ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ లిరికల్ వీడియో నెటిజన్లలో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment