విజయమ్మలా... | Ashrita Vemuganti to play Vijayamma in YSR biopic | Sakshi
Sakshi News home page

విజయమ్మలా...

Published Tue, Jan 8 2019 12:33 AM | Last Updated on Tue, Jan 8 2019 12:33 AM

Ashrita Vemuganti to play Vijayamma in YSR biopic - Sakshi

అశ్రిత వేముగంటి

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితం ఆధారంగా ‘యాత్ర’ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. మహి వి.రాఘవ్‌ దర్శకత్వంలో 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 8న విడుదలవుతోంది. ఈ చిత్రంలో వైఎస్‌ పాత్రలో మలయాళ స్టార్‌ హీరో మమ్ముట్టి నటించారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్, టీజర్‌ చూస్తే వైఎస్‌ పాత్రలో మమ్ముట్టి చక్కగా ఒదిగిపోయారంటున్నారు సినీ అభిమానులు.

ఇందులో వైఎస్‌ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు నటించారు. మరి వైఎస్‌ సతీమణి విజయమ్మ పాత్రను ఎవరు చేశారు? అనే ఆసక్తి అటు సినీ వర్గాలతో పాటు ఇటు వైఎస్‌ అభిమానులు, ప్రేక్షకుల్లో నెలకొంది. తాజాగా ‘యాత్ర’ బృందం వైఎస్‌ విజయమ్మ పాత్రధారి అశ్రిత వేముగంటి ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. ఈ పోస్టర్‌ చూసినవాళ్లు అచ్చం విజయమ్మలాగే అశ్రిత ఉందంటున్నారు. ‘బాహుబలి 2’లో అనుష్క వదిన పాత్రలో నటించారు అశ్రిత.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement