Ashrita
-
విక్టరీ వెంకటేష్ కూతురు ఆశ్రిత అరుదైన రికార్డు
venkatesh daughter ashritha daggubati: హీరో వెంకటేష్ కూతురు ఆశ్రిత అరుదైన రికార్టును సొంతం చేసుకుంది. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ రిచ్‌లిస్ట్ జాబితాలో చోటు దక్కించుకుంది. కాగా ఆశ్రితకే కుకింగ్ హ్యాబిట్ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్ఫినిటీ ప్లాటర్ అనే పేరుతో అకౌంట్ క్రియేట్ చేసి అందులో తన చేసే రకరకాల వంటకాల వీడియోలు షేర్ చేస్తుంటుంది. ఆమెకు ఇన్‌స్టాలో 13 లక్షలకు పైగా ఫాలోవర్స్ కూడా ఉన్నారు. కాగా ఇటీవల హోపర్ డాట్ కం ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రెటీల జాబితాను విడుదల చేసింది. ఇందులో ప్రపంచలోనే అత్యధికంగా సంపాదిస్తున్న వారిలో హాలీవుడ్ నటుడు క్రిస్టియానో రోనాల్డో మొదటి స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఇండియా నుంచి విరాట్ కోహ్లి, నటి ప్రియాంక చొప్రా ఉన్నారు. ఇదే జాబితాలో వెంకటేష్ కూతురు ఆశ్రిత కూడా చోటు సంపాదించుకుంది. ఈ లిస్టులో ఆశ్రిత ప్రపంచవ్యాప్తంగా 377 స్థానంలో నిలవగా.. ఆసియా మొత్తంలో 27వ ర్యాంకులో ఉంది. భారతీయులు అత్యల్పంగా ఉన్న ఈ జాబితాలో ఆశ్రిత చోటు దక్కించుకోవడం విశేషం. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో వీడియోకు సుమారు 400 డాలర్లు తీసుకుంటుందట. కాగా ఆశ్రిత 2019లో వినాయక రెడ్డిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరు స్పెయిన్‌లోని బార్సిలోనాలో సెటిల్ అయ్యారు. View this post on Instagram A post shared by Infinity Platter (@infinityplatter) -
సల్మాన్‌తో వెంకీ చిందులు.. వైరల్ వీడియో
టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ కూతురు ఆశ్రిత వివాహం జైపూర్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. వీటన్నింటిలోకి ఒక వీడియో మాత్రం విపరీతంగా ట్రెండ్ అవుతోంది. వెంకీ కూతురు వివాహానికి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా హాజరైన సంగతి తెలిసిందే. పెళ్లికి వచ్చిన సల్మాన్.. వెంకీతో కలిసి చిందేశారు. వీరితో పాటు రానా కూడా చేరి మరింత సందడి చేశారు. తన ‘కిక్’ సినిమాలోని జుమ్మే కీ రాత్ పాటకు వెంకీ, రానాలతో కలిసి సల్మాన్ డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. వెంకటేశ్ కుమార్తె ఆశ్రిత, హైదరాబాద్ రేస్ క్లబ్ ఛైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డిల వివాహం ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని జయపురలో జరిగిన ఈ శుభకార్యానికి సినీ ప్రముఖులు హాజరై నూతన దంపతుల్ని ఆశీర్వదించారు. వెంకటేశ్ స్నేహితుడు సల్మాన్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. -
విజయమ్మలా...
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా ‘యాత్ర’ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. మహి వి.రాఘవ్ దర్శకత్వంలో 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 8న విడుదలవుతోంది. ఈ చిత్రంలో వైఎస్ పాత్రలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ చూస్తే వైఎస్ పాత్రలో మమ్ముట్టి చక్కగా ఒదిగిపోయారంటున్నారు సినీ అభిమానులు. ఇందులో వైఎస్ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు నటించారు. మరి వైఎస్ సతీమణి విజయమ్మ పాత్రను ఎవరు చేశారు? అనే ఆసక్తి అటు సినీ వర్గాలతో పాటు ఇటు వైఎస్ అభిమానులు, ప్రేక్షకుల్లో నెలకొంది. తాజాగా ‘యాత్ర’ బృందం వైఎస్ విజయమ్మ పాత్రధారి అశ్రిత వేముగంటి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ పోస్టర్ చూసినవాళ్లు అచ్చం విజయమ్మలాగే అశ్రిత ఉందంటున్నారు. ‘బాహుబలి 2’లో అనుష్క వదిన పాత్రలో నటించారు అశ్రిత. -
అందమైన 'మనసున్న' హీరోయిన్
తాను అందమైన హీరోయిన్ మాత్రమే కాదు... అందమైన మనసున్న మనిషినని నిరూపించుకుంది బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మ. సినిమా షూటింగ్స్ తో ఊపిరి సలపకుండా ఉన్నప్పటికీ కాస్త సమయాన్ని వినియోగించింది. ఓ అభిమాని కోరికను తెలుసుకుని ఆశ్చర్యానికి లోనైంది. హీరో రణవీర్ సింగ్ తో కలిసి చిన్నారి ఫ్యాన్ కలను నిజం చేసింది ఈ భామ. అంగవైకల్యంతో బాధపడుతున్న చిన్నారి అశ్రిత కోరికను మేక్ ఏ విష్ ఫౌండేషన్ తెలుసుకుంది. నటి అనుష్కశర్మను తనకు కలుసుకోవాలని ఉన్నట్లు ఫౌండేషన్ వారికి ఆ చిన్నారి ఫ్యాన్ చెప్పింది. ఫౌండేషన్ వారు అశ్రిత విషయాన్ని ఆమెకు వివరించారు. స్నేహితుడు రణవీర్ సింగ్ తో సహా ఆ చిన్నారి ఇంటికి వెళ్లింది. ఆ కుటుంబసభ్యులను ఈ హీరోహీరోయిన్లు ఆశ్చర్యంలో ముంచెత్తారు. అభిమాన హీరోయిన్ అనుష్కతో పాటు రణవీర్ కూడా రావడంతో ఆ చిన్నారి ఫ్యాన్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అనుష్క ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో కలిసి 'సుల్తాన్' మూవీలో నటిస్తోంది. కాగా, ఆదిత్యా చోప్రా తీస్తున్న 'బేఫికర్' షూటింగ్ లో రణవీర్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయినా, కాస్త వీలు చూసుకుని ఆ చిన్నారిని కలిసి కాసేపు సందడి చేశారు. ప్రతి ఒక్కరికి కొన్ని కలలు ఉంటాయని అవి నిజమైనప్పుడు చాలా సంతోషపడతారని అనుష్క చెప్పింది. -
అడ్డగోలు నిర్ణయాలు ఇంకెంత కాలం: వైఎస్సార్సీపీ
సాక్షి, హైదరాబాద్: మన తెలంగాణ... మన పాలన... అన్నీ అందరి నిర్ణయాలతో సమష్ఠిగా కలసి బంగారు పాలన చేసుకుందామని ఉద్యమ సమయంలోనూ, ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన సీఎం కేసీఆర్ వాస్తవంగా, క్షేత్రస్థాయిలో చేస్తున్నదేమిటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ ప్రశ్నించింది. హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి.. సీఎం కేసీఆర్ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హుజూరాబాద్‌లో ఉపాధ్యాయురాలి దండనకు తొమ్మిదేళ్ల ఆశ్రీత బలికావటం తమ పార్టీని కలచి వేసిందన్నారు. ప్రభుత్వం ఈ అంశంపై విచారణ చేపట్టాలని కోరారు. విద్యా శాఖను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆ దిశగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఆలోచించాలని హితవు పలికారు. ఉస్మానియా ఆస్పత్రి శిథిలావస్థకు చేరిన మాట నిజమేనని తమ పార్టీ అంగీకరిస్తుందని తెలిపారు. వారంలోనే ఖాళీ చేయిస్తామని సీఎం అత్యవసరంగా ప్రకటించడం ఎంటని ప్రశ్నించారు. అది ఆచరణ సాధ్యమా... ప్రకటించిన కేసీఆర్‌కే తెలియాలని చెప్పారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లపై సీఎం కమిటీ వేసినా ఇంత వరకు ఒక్కసారన్నా అది సమావేశం కాలేదన్నారు. 13 నెలల్లో సీఎం రకరకాల నిర్ణయాలు తీసుకున్నారని... 18 సార్లు హైకోర్టు మొట్టికాయలు వేసిందని తెలిపారు. ఇలాంటి దుందుడుకు నిర్ణయాల సీఎంను తాను ఎన్నడూ చూడలేదని కొండా పేర్కొన్నారు. ఒకే రోజు కేబినెట్ సమావేశంలో 43 నిర్ణయాలపై కేసీఆర్ సర్కారు వైఖరి ప్రకటించిందన్నారు. దాన్ని ఒక రికార్డుగా ఆయన మంత్రి వర్గసభ్యులు ప్రచారం చేసుకున్నా.. వాటిపై ఇప్పటికీ స్పష్టత లేదన్నారు. తక్షణమే 43 నిర్ణయాలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. -
'ఎనిమిది భాషలు మాట్లాడగలను'
ముషీరాబాద్: చిన్న వయస్సులోనే అనేక అంశాల్లో అసమాన ప్రతిభ చాటుతూ అందరి మన్ననలు పొందుతోంది.. ఎన్నారై శేషసాయి, శుభ దంపతుల కుమార్తె ఆశ్రిత. వివిధ కళల్లో ప్రావీణ్యం సంపాదించడంతో పాటు ఎనిమిది భాషల్లో అనర్గళంగా మాట్లాడుతూ ఆశ్చర్యానికి గురిచేస్తోందీ పదిహేనేళ్ల అమ్మాయి. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూనే.. పలు కమర్షియల్ వేదికలపై బాలీవుడ్ ప్రముఖులతో కలిసి స్టెప్పులేస్తోంది. తన ప్రతిభ, వాక్చాతుర్యంతో ప్రధాని మోదీ, గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబును విస్మయానికి గురిచేసింది. హైదరాబాద్‌లోని అడిక్మెట్కు చెందిన శేషషాయి 2005లో ఉద్యోగ రీత్యా కెనడాలోని వ్యాంకోవర్ వెళ్లారు. అక్కడ క్వాలిటీ కంట్రోలర్‌గా పని చేస్తున్నారు. భార్య శుభ అక్కడే డెంటిస్ట్‌గా పని చేస్తోంది. ఐదేళ్ల వరకు ఇక్కడే ఉన్న ఆశ్రీత 2వ తరగతి వరకు చదివి... 2007లో తల్లిదండ్రుల చెంతకు వెళ్లింది. వేసవి సెలవులు కావడంతో రెండున్నర నెలల పాటు తాత, అమ్మమ్మల వద్ద గడిపేందుకు ఇండియాకు వచ్చింది. ఈ సందర్భంగా ‘సాక్షి’ ఆమెతో ముచ్చటించింది. సాక్షి: మీరు నేర్చుకున్న కళల గురించి చెబుతారా..? ఆశ్రీత: భరతనాట్యం, కూచిపూడి, కథాకళి, మోహినిఅట్టం, మోడ్రన్ డ్యాన్స్ నేర్చుకున్నాను. 2011, 2013లో కెనడాలో జరిగిన టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిలిమ్స్ అవార్డ్స్ ఫంక్షన్లో ప్రదర్శనలిచ్చా. ప్రియాంక చోప్రా, ఐశ్వర్యరాయ్, షారుఖ్‌ఖాన్, కత్రినా కైఫ్, అభిషేక్ బచ్చన్ తదితర బాలీవుడ్ నటులతో కలిసి స్టేజ్ షోలలో డ్యాన్స్ చేశా. అమ్మ శుభ కూచిపూడి నృత్యకారిణి కావడం కలిసొచ్చింది. సాక్షి: ఏఏ భాషలు మాట్లాడగలరు..? ఆశ్రీత: మాతృభాష తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, గుజరాతి, ఇంగ్లిష్, హిందీ, ఫ్రెంచ్ ఎనిమిది భాషలు మాట్లాడగలను. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు తాత నుంచి తెలుగు, అమ్మమ్మ ద్వారా కన్నడ, తమిళం వచ్చింది. కెనడాలోని స్నేహితుల వల్ల ఇంగ్లిష్, ఫ్రెంచ్ నేర్చుకున్నా. డ్యాన్స్ టీచర్ మలయాళీ కావడంతో ఆమె నుంచి మలయాళం తెలుసుకున్నా. కానీ తెలుగు మాట్లాడటమే ఇష్టం. సాక్షి: మీరు నిర్వహించే సేవా కార్యక్రమాల గురించి... ఆశ్రీత: ఇండో కెనడియన్ యూత్ కౌన్సిల్ సంస్థను ఏర్పాటు చేశా. సభ్యులతో తరచూ సమావేశమై సేవా కార్యక్రమాలు చేపడుతుంటా. ఇటీవల నిర్వహించిన నేషనల్ యోగా డేలో యూత్ కన్వీనర్‌గా పాల్గొన్నా. దీనికి గానూ ఇండో కెనడియన్ యూత్ అచీవర్ అవార్డు అందుకున్నా. సాక్షి: అదనపు యాక్టివిటీస్ ఏవైనా చేస్తారా..? ఆశ్రీత: స్విమ్మింగ్, ఐస్ స్కేటింగ్‌లో ప్రావీణ్యం ఉంది. పబ్లిక్ స్పీకింగ్ స్టేట్ లెవల్ ఇంటర్ స్కూల్ పోటీల్లో భాగంగా ‘ప్రపంచం - ఆకలి’ అంశంపై చేసిన ప్రసంగానికి మొదటి బహుమతి వచ్చింది. వ్యాంకోవర్‌లో జరిగే పలు కార్యక్రమాల్లో యూఎన్ఓ వలంటీర్‌గా పని చేస్తా. ఫండ్ రైజింగ్ ద్వారా వచ్చిన డబ్బులను ఆఫ్రికన్ స్కూల్ పిల్లల కోసం వెచ్చించా. మిస్ టీనేజ్ సౌతర్న్ బీసీ -2014కి ఎంపికయ్యా. ప్రధాని మోదీతో కెనడాలో డిన్నర్ చేశా. సాక్షి: మీ జీవిత లక్ష్యం? ఆశ్రీత: వ్యాంకోవర్‌లో డాక్టర్ విద్యను పూర్తి చేసుకుని చిన్న పిల్లల డాక్టర్ అయి భారత దేశానికి సేవ చేయాలనేదే...