సన్నివేశంలో పాల్గొన్న నటుడు మమ్ముట్టి, నటి సుహాసిని
భూదాన్‌పోచంపల్లి(భువనగిరి) : పోచంపల్లిలో 70ఎంఎం పిక్చర్స్ బ్యానర్‌పై దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న ‘యాత్ర’ సినిమా షూటింగ్ బుధవారం జరిగింది. పోచంపల్లిలోని టూరిజం పార్క్, చెరువు కట్ట సమీపంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాత్రలో నటిస్తున్న మళయాల సూపర్‌స్టార్ మమ్ముట్టి, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పాత్రలో నటిస్తున్న ప్రముఖ నటి సుహాసినిపై పాదయాత్రకు సంబంధించిన పలు సన్నివేశాలను చిత్రీకరించారు. పాదయాత్రలో భాగంగా ఓ పాటలోని బ్యాక్‌గ్రౌండ్ సన్నివేశాలను ప్రముఖ కొరియోగ్రాఫర్ బృంద పర్యవేక్షణలో వివిధ వర్గాల ప్రజలను కలిసే సన్నివేశాలను తెరకెక్కించారు. కాగా ఈ సినిమాకు మహి, వి రాఘవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి, సంగీతం కృష్ణకుమార్, కెమెరామెన్‌గా సత్యన్‌సూర్యన్ వ్యవహరిస్తున్నారు. కాగా సినిమా షూటింగ్ చూడడానికి ప్రజలు భారీగా తరలిరావడంతో సందడి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment