రాజన్నా.. నిన్నాపగలరా.. | ysr biopic yatra movie updates | Sakshi
Sakshi News home page

రాజన్నా.. నిన్నాపగలరా..

Published Thu, Jan 3 2019 1:36 AM | Last Updated on Thu, Jan 3 2019 5:17 AM

ysr biopic yatra movie updates - Sakshi

మమ్ముట్టి

మహానేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘యాత్ర’. మమ్ముట్టి టైటిల్‌ రోల్‌ పోషించారు.  మహీ వి. రాఘవ్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు. ‘యాత్ర’లోని రెండవ పాట ‘రాజన్నా నిన్నాపగలరా..’ను ఇటీవల రిలీజ్‌ చేశారు.

‘‘ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి నేరుగా ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలను తెలుసుకోవడాన్ని, దాంతో ప్రజలంతా పొందిన ఆనందాన్ని ఈ పాటలో చూపించబోతున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ‘యాత్ర’ చిత్రాన్ని ఫిబ్రవరి 8న రిలీజ్‌ చేస్తున్నాం. తెలుగు, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: కె, ఎడిటర్‌:  శ్రీకర్‌ ప్రసాద్, కెమెరా: సత్యన్‌ సూర్యన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement