
చిల్పూరు: యాత్ర సినిమా విడుదల సందర్భంగా స్టేషన్‌ఘన్‌పూర్ మండల కేంద్రానికి చెందిన వైఎస్‌ఆర్ అభిమాని కల్లూరి శరత్ శుక్రవారం 150 టికెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత మహానేత వైఎస్‌ఆర్ అంటే అభిమానమని తెలిపారు. యాత్ర సినిమా విడుదల సందర్భంగా తన శక్తి మేరకు ఉచితంగా సినిమా టికెట్లను పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సినిమాను తిలకించి ఆదరించాలన్నారు.