tickets distribution
-
అజారుద్దీన్ పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఫైర్
-
క్రికెట్ అభిమానులకు హెచ్సిఏ శుభవార్త
-
IND Vs AUS: జింఖానాలో ఇవాళ టికెట్ల విక్రయం
సాక్షి, హైదరాబాద్: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 25న ఉప్పల్ స్టేడియంలో జరిగే చివరి టి20 మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ‘ఆఫ్‌లైన్’లో అమ్మకానికి ఉంచింది. ఈ నెల 15న స్వల్ప సంఖ్యలో టికెట్లను ‘పేటీఎం ఇన్సైడర్’ యాప్ ద్వారా ఆన్లైన్లో హెచ్‌సీఏ అందుబాటులోకి తీసుకురాగా, కొద్ది సేపటిలోనే అవి పూర్తిగా అమ్ముడుపోయాయి. దాంతో పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో అభిమానుల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుంటూ ‘పేటీఎం ఇన్సైడర్’తో చర్చలు జరిపిన హెచ్‌సీఏ టికెట్లను నేరుగా కౌంటర్లో అమ్మాలని నిర్ణయించింది. నేడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో టికెట్ కౌంటర్ ఉంటుంది. ఒక వ్యక్తికి గరిష్టంగా రెండు టికెట్లు మాత్రమే ఇస్తారు. టికెట్లు కొనుగోలు చేసేందుకు వచ్చే అభిమానులు ఆధార్ కార్డు తీసుకురావాలి. అయితే టికెట్ల మొత్తం సంఖ్యతో పాటు ఆన్లైన్, ఆఫ్లైన్లలో వేర్వేరుగా ఎన్ని టికెట్లు అందుబాటులో ఉంటాయనే విషయంలో మాత్రం హెచ్‌సీఏ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. బ్లాక్‌లో అమ్మితే చర్యలు: క్రీడా మంత్రి భారత్, ఆస్ట్రేలియా టి20 మ్యాచ్ టికెట్ల అమ్మకాలకు సంబంధించి చోటు చేసుకుంటున్న గందరగోళంపై తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ‘క్రీడల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తేనే హెచ్‌సీఏ స్టేడియం కట్టుకుంది. ఇది తెలంగాణ ప్రజల కోట్ల విలువైన ఆస్తి. అలాంటప్పుడు రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేస్తే ఊరుకునేది లేదు. అభిమానుల ఉత్సాహాన్ని దెబ్బ తీయవద్దు. బ్లాక్‌లో టికెట్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్‌సీఏను హెచ్చరించాం. దీనిపై అవసరమైతే విచారణ కూడా జరిపిస్తాం. అదే విధంగా బయటి వ్యక్తులు కూడా ఎవరైనా తనకు టికెట్లు కావాలంటూ బెదిరించినా చర్య తీసుకుంటాం’ అని ఆయన స్పష్టం చేశారు. గుజరాత్లో జరిగే జాతీయ క్రీడల్లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర బృందానికి క్రీడా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ బుధవారం కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ‘శాట్స్’ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డితో పాటు ఒలింపిక్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ నెల 29 నుంచి అక్టోబర్ 12 వరకు జరిగే జాతీయ క్రీడల్లో తెలంగాణ నుంచి 230 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
యాత్ర సినిమా టికెట్లు పంపిణీ చేసిన అభిమాని
చిల్పూరు: యాత్ర సినిమా విడుదల సందర్భంగా స్టేషన్‌ఘన్‌పూర్ మండల కేంద్రానికి చెందిన వైఎస్ఆర్ అభిమాని కల్లూరి శరత్ శుక్రవారం 150 టికెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత మహానేత వైఎస్ఆర్ అంటే అభిమానమని తెలిపారు. యాత్ర సినిమా విడుదల సందర్భంగా తన శక్తి మేరకు ఉచితంగా సినిమా టికెట్లను పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సినిమాను తిలకించి ఆదరించాలన్నారు. -
కర్ణాటక కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి
-
కాంగ్రెస్‌లో టికెట్ల కుమ్ములాట
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కన్నడనాట మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ హై కమాండ్‌కు టికెట్ల పంపిణీ కొత్త తలనొప్పులు తీసుకొచ్చింది. కర్ణాటక సర్కారులో ఉన్న మంత్రులు తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ నేరుగా అధిష్టానాన్ని ఆశ్రయించారు. ఇప్పటికే అన్ని పార్టీలు తొలివిడతగా తమ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ.. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ మాత్రం జాబితా విషయంలో స్పష్టతనీయటం లేదు. కన్నడ మంత్రుల్లో ఎనిమిది మంది.. తమ పిల్లలు, అనుచరులకు టికెట్లు ఇవ్వాలంటూ పట్టుబడుతుండటమే అసలు కారణం. అయితే పార్టీ అధ్యక్షుడు రాహుల్ నేతృత్వంలో దీనిపై సుదీర్ఘంగా చర్చించిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ.. ఆదివారం తొలి జాబితా విడుదల చేయొచ్చని తెలుస్తోంది. సంతానంతోనే సమస్య! సీఎం సిద్దరామయ్య సైతం చాముండేశ్వరి (సిట్టింగ్), బదామీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. తన కుమారుడు యతీంద్రకూ టికెట్ ఇప్పించుకోవాలని పోటీపడుతున్నారు. అయితే సిద్దరామయ్య (కుమారుడికి), హోం మంత్రి రామ లింగారెడ్డి (కూతురికి), మాజీ కేంద్ర మంత్రి కేహెచ్ మునియప్ప (కూతురికి), మల్లికార్జున ఖర్గే (కుమారుడు – రాష్ట్ర ఐటీ మంత్రి)లు ఈ విషయంలో విజయం సాధించినట్లేనని తెలుస్తోంది. మార్గరెట్ అల్వా (కుమారుడు నివేదిత్ అల్వా), వీరప్ప మొయిలీ (కుమారుడు హర్ష మొయిలీ), పీసీసీ చీఫ్ పరమేశ్వర (కుమారుడు) మంత్రులు ఆర్వీ దేశ్‌పాండే (కుమారుడు), టీబీ జయచంద్ర (కుమారుడు)కూడా తమ వాళ్లకు టికెట్లు ఇప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే జేడీఎస్, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు టికెట్లు ఇవ్వాల్సిందేనంటూ సిద్దరామయ్య, వద్దని ఖర్గే, వీరప్ప మొయిలీ పట్టుబడుతుండటమే ఈ జాబితా ఆలస్యానికి కారణంగా తెలుస్తోంది. రాహుల్ సమక్షంలోనే వాకౌట్లు..: శుక్ర వారం ఉదయం రాహుల్ అధ్యక్షతన జరిగిన ఎన్నికల కమిటీ సమావేశంలో సీఎం సిద్దరామయ్య, లోక్‌సభ పక్షనేత మల్లికార్జున ఖర్గే, మాజీ సీఎం వీరప్ప మొయిలీ, పీసీసీ చీఫ్ జి.పరమేశ్వర తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీలో నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి నేతలు వాకౌట్ చేసేంతవరకు వెళ్లింది. దీంతో మళ్లీ సాయంత్రం సమావేశమయ్యా రు. ఈ భేటీలో సోనియా పాల్గొన్నారు. -
బీజేపీ సెల్ఫ్‌గోల్ చేసుకుందా?
ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు.. నాయకులు పార్టీలు మారడం సర్వసాధారణం. కానీ, అప్పటి వరకు పార్టీ జెండాను భుజాన మోసి ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకులను విస్మరించి కొత్తవారికి మాత్రమే టికెట్లు ఇస్తూ పోతే పాతవాళ్లలో తీవ్ర అసంతృప్తి రేగక తప్పదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో బీజేపీలో ప్రస్తుత పరిస్థితి ఇలాగే ఉంది. ఒక్క మణిపూర్ తప్ప.. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో ఆ పార్టీలోకి కొత్త నాయకుల రాక వెల్లువెత్తుతోంది. కానీ, టికెట్ల కేటాయింపు వ్యవహారం మాత్రం దాదాపు నాలుగు రాష్ట్రాల్లోను ఆ పార్టీకి తలనొప్పిగానే మారింది. కొత్తవాళ్లకు టికెట్లు ఇవ్వడం వల్ల పార్టీ క్రమంగా బలహీన పడటంతో పాటు, సెల్ఫ్‌గోల్ చేసుకుంటున్నట్లు అవుతోంది. యూపీలో పాతిక మంది బయటివాళ్లే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ బయటి వాళ్లకు టికెట్లు ఎక్కువగానే ఇచ్చింది. ఇది సొంత పార్టీ వాళ్లను ఆగ్రహానికి గురిచేసింది. యూపీలో బీజేపీ విడుదల చేసిన మొదటి జాబితాలో మొత్తం 149 మంది అభ్యర్థులుండగా.. వాళ్లలో 25 మంది ఈమధ్యే పార్టీలో చేరినవారు. గత సంవత్సరం పార్టీలో చేరిన బీఎస్పీ మాజీ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య.. తన కోటాలో రావల్సినన్ని టికెట్లు రాలేదని ఆగ్రహంగా ఉన్నారు. దాంతో పార్టీ నుంచి బయటకు వెళ్లాలని కూడా చూస్తున్నారు. తివారీ ఎందుకు ఇక ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎన్డీ తివారీని బీజేపీలో చేర్చుకోవడంపై అక్కడ తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. తన కొడుకు టికెట్ కోసం ఆయన బీజేపీని ఆశ్రయించిన విషయం తెలిసిందే. కానీ.. ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న సమయంలో ఆయనకు సంబంధించిన అశ్లీల సీడీలు బయటపడిన నేపథ్యంలో అలాంటి వ్యక్తిని ఎందుకు దగ్గరకు తీసుకోవాలని అంటున్నారు. దాంతో తివారీ విషయంలో బీజేపీ వెనక్కి తగ్గింది. ఆయన చేరలేదని.. కేవలం రోహిత్ మాత్రమే చేరాడని చెప్పింది. తివారీ కేవలం బీజేపీకి మద్దతు మాత్రమే పలికారని చెప్పింది. ఇలా వచ్చారు.. అలా టికెట్ ఇచ్చారు ఉత్తరాఖండ్‌లో మొత్తం 64 మంది అభ్యర్థులను ప్రకటించగా, అందులో 15 మంది బయటివారే. జనవరి 16వ తేదీన ఆ రాష్ట్ర రెవెన్యూ, నీటి పారుదల శాఖ మంత్రి యశ్పాల్ ఆర్య తన కొడుకు సంజీవ్, మాజీ ఎమ్మెల్యే కేదార్ సింగ్ రావత్‌లతో కలిసి బీజేపీలో చేరిపోయారు. వాళ్లు చేరిన కొద్ది గంటలకే బీజేపీ ఉత్తరాఖండ్ అభ్యర్థుల జాబితా రాగా.. అందులో ఈ మూడు పేర్లూ ఉన్నాయి. ఇంతకుముందు హరీష్ రావత్ సర్కారుపై తిరుగుబాటు చేసిన పలువురు మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా టికెట్లిచ్చారు. దీంతో పార్టీలో ఎప్పటినుంచో ఉన్నవాళ్లు ఆగ్రహంతో ఉన్నారు. పంజాబ్ చీఫ్ అసంతృప్తి పంజాబ్‌లో టికెట్ల కేటాయింపుతో అసంతృప్తి చెందిన పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి విజయ్ సంప్లా సిద్ధపడ్డారు. అయితే, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ఆయనను బుజ్జగించి వెనక్కి పంపారు. ఒక సిటింగ్ ఎమ్మెల్యేను తప్పించి, తాను చెప్పిన వ్యక్తికి టికెట్ ఇవ్వాలన్నది సంప్లా డిమాండు. గోవాలో తిరుగుబాట్లు గోవాలో ఇప్పటికే బీజేపీ తిరుగుబాట్లతో ఇబ్బంది పడుతోంది. 2016 ఆగస్టులో నాటి ఆర్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ వేలింగ్‌కర్ ప్రాంతీయ భాష విషయంలో ఆగ్రహించి, గోవా సురక్షా మంచ్ (జీఎస్ఎం) అనే పార్టీ పెట్టారు. ఇప్పుడు ఆ పార్టీ, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ), శివసేన కలిసి కూటమిగా ఏర్పడి అసెంబ్లీ బరిలోకి దిగుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 35 చోట్ల ఈ కూటమి పోటీ చేస్తోంది. ఎంజీపీ కూడా ఇంతకుముందు బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకున్న విషయం తెలిసిందే.