
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా యాత్ర పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లెజెండరీ నటుడు మమ్ముట్టీ, వైఎస్సార్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ప్రస్తుతం నిర‍్మాణ దశలో ఉన్న ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్ పూర్తిచేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 8న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా యాత్ర టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
జగపతిబాబు, సుహాసిని, అనసూయ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను 2019 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మా సినిమాలను నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. పాఠశాల, ఆనందో బ్రహ్మా చిత్రాల దర్శకుడు మహి వి రాఘవ ఈ చిత్రానికి దర్శకుడు.
Comments
Please login to add a commentAdd a comment