మంచు విష్ణు ‘కన్నప్ప’లో మరో స్టార్‌ హీరో | Mohanlal To Play Key Role On Manchu Vishnu Kannappa | Sakshi
Sakshi News home page

‘కన్నప్ప’ కోసం రంగంలోకి స్టార్‌ హీరోలు.. మొన్న ప్రభాస్‌.. ఇప్పుడు మోహన్‌ లాల్‌

Published Sat, Sep 30 2023 3:14 PM | Last Updated on Sat, Sep 30 2023 3:37 PM

Mohanlal To Play Key Role On Manchu Vishnu Kannappa - Sakshi

‘కన్నప్ప’ విషయంలో ఎక్కడ తగ్గట్లేదు డైటమిక్‌ హీరో మంచు విష్ణు. టెక్నీషియన్లను మొదలుకొని నటీనటుల వరకు పెద్ద పెద్ద వాళ్లనే తీసుకుంటున్నాడు. దీంతో కన్నప్ప మీద రోజు రోజు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలో ప్రభాస్‌ నటించబోతున్న విషయం తెలిసిందే. సినిమాలో కీలకపై శివుని పాత్రలో ప్రభాస్‌ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్‌కి జోడిగా..అంటే పార్వతిగా నయనతార నటించబోతున్నట్లు నెట్టింట ఓ వార్త వైరల్‌ అవుతోంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ ప్రాజెక్ట్‌లో మరో స్టార్‌ హీరో వచ్చి చేరాడు. మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ సైతం కన్నప్ప సినిమాలో ఓ ముఖ్య పాత్రను పోషించబోతున్నారు. ఈ మేరకు మంచు విష్ణు రీసెంట్‌గా మోహన్ లాల్‌ను కలిశారు. ఈ మేరకు వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. 

బాలీవుడ్ టెలివిజన్ రంగంలో సూపర్ హిట్ మహాభారత సిరీస్ ని తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.  అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సుమారు రూ. 150 కోట్ల నిర్మాణ వ్యయంతో  రూపొందుతున్న ఈ చిత్రానికి మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement