
సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాలో మలయాళ స్టార్ మోహన్‌లాల్ కనిపించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ ‘జైలర్’ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో, తమన్నా కీ రోల్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో మోహన్‌లాల్ కూడా నటిస్తున్నట్లు తెలిసింది. మోహన్‌లాల్ అతిథి పాత్రలో కనిపించనునున్నారని, ఈ వారంలోనే షూటింగ్‌లో జాయిన్ అవుతారని కోలీవుడ్ సమాచారం. కాగా ‘జైలర్’ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేయాలని అనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment