
మలయాళ ప్రముఖ నటుడు మోహన్‌లాల్ కూతురు విస్మయ భారీగా బరువు తగ్గి అభిమానులకు షాక్ ఇచ్చారు. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో నివసిస్తున్న ఆమె ఇప్పటి వరకు చాలా లావుగా, బొద్దుగా ఉండేవారు. ఇలా ఒక్కసారిగా సన్నబడి నెటిజన్లకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. బరువు తగ్గడం కోసం తీవ్రంగా శ్రమించి ప్రత్యేక వ్యాయామాలు, మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. దీంతో ఏకంగా 22 కిలోలు బరువు తగ్గారు. ఈ క్రమంలో శుక్రవారం బరువుతో ఉన్న ఫోటోను, ఇప్పటి ఫోటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతోపాటు మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్‌కు సంబంధించిన వీడియోను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు విస్మయ కష్టాన్ని గుర్తిస్తూ, ఆమెను పొగడ్తలతో ముంచెస్తున్నారు. చదవండి: హిట్లర్ టు లూసిఫర్
విస్మయ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాసుకొచ్చింది. థాయ్‌లాండ్‌లో ప్రతిక్షణం సంతోషంగా గడిపాను. ఇక్కడి శిక్షణ బృందం చాలా మంచివారు. ఇక్కడకు వచ్చాక ఏం చేయాలో తోచలేదు. కొన్నేళ్ల క్రితం నేను నాలుగు మెట్లు ఎక్కుతుంటేనే ఊపిరాడక ఇబ్బందిపడేదాని. దీంతో బరువు తగ్గాలనే ఆలోచన వచ్చింది. ఇప్పుడు, శిక్షణ తీసుకుని 22 కిలోల బరువు తగ్గాను. చాలా ఆనందంగా ఉంది. ఇదంతా నా కోచ్ వల్లే సాధ్యమైంది. తను లేకుంటే నేనేం చేయలేకపోయేదాన్ని. ప్రతిరోజు నేను బెస్ట్ ఇచ్చేలా ఎంకరేజ్ చేశారు. నా మీద నాకు నమ్మకం పెంచారు. తను నాకెంతో సాయం చేశారు. నేను చేయలేను అనే ఆలోచన నుంచి ఏదైనా చేయగలిగేలా చేశారు. అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment