
Mohanlals Marakkar To Release In Theatres: ‘మరక్కర్’ థియేటర్స్‌కే వస్తున్నాడు. ప్రచారంలో ఉన్నట్లు ఓటీటీలోకి కాదు. ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ టైటిల్ రోల్‌లో నటించిన మలయాళ చిత్రం ‘మరక్కర్: అరబికడలింటే సింహమ్’. 15వ శతాబ్దానికి చెందిన న్యావల్ చీఫ్ మహ్మద్ అలీ మరక్కర్ అలియాస్ కుంజాలి మరక్కర్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. అర్జున్, సునీల్ శెట్టి, కీర్తీ సురేశ్, మంజు వారియర్, కల్యాణీ ప్రియదర్శన్ ఈ చిత్రంలో కీలక పాత్రధారులు.
ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందనే వార్తలకు ఫుల్‌స్టాప్ పడేలా.. ‘‘ఇంతకాలం సీల్ చేసి ఉన్న విషయాన్ని బ్రేక్ చేసి, స్టన్నింగ్ సర్‌ప్రైజ్‌గా చెబుతున్నాం. ‘మరక్కర్’ చిత్రం థియేటర్స్‌లో ఈ ఏడాది డిసెంబరు 2న విడుదల కానుంది’’ అని శుక్రవారం మోహన్‌లాల్ స్పష్టం చేశారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అనువాదమై ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. 67వ జాతీయ అవార్డ్స్‌లో ఈ చిత్రం మూడు (బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ కాస్ట్యూమ్) విభాగాల్లో అవార్డులు సాధించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment