
మూడు జాతీయ అవార్డులు (బెస్ట్ పిక్చర్, బెస్ట్ వీఎఫ్‌ఎక్స్, బెస్ట్ కాస్ట్యూమ్స్) సాధించిన మలయాళ చిత్రం ‘మరక్కార్: ది అరబికడలింటే సింహం’ చిత్రం తెలుగులో విడుదల కానుంది. మోహన్‌లాల్ టైటిల్ రోల్ చేసిన ఈ చిత్రాన్ని ‘మరక్కార్: అరేబియా సముద్ర సింహం’ టైటిల్‌తో సురేష్ ప్రొడక్షన్స్ తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేయనుంది. ఈ చిత్రం ఈ డిసెంబరు 2న రిలీజ్ కానుంది.
అర్జున్, సునీల్ శెట్టి, సుదీప్, ప్రభు, మంజు వారియర్, కీర్తీ సురేష్, కల్యాణీ ప్రియదర్శన్, ప్రణవ్ మోహన్‌లాల్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. ‘‘ఈ చిత్రం నుంచి విడుదలైన ‘కనులను కలిపినా’ పాటకు మంచి స్పందన లభి స్తోంది. సినిమాకూ మంచి ఆదరణ లభిస్తుందని నమ్ముతున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.