
కార్తీక్ సుబ్బరాజు, సూర్య
‘లవ్... లాఫ్టర్... వార్...’ అంటూ సూర్య కొత్త చిత్రం అధికారిక ప్రకటన గురువారం వెలువడింది. ‘పిజ్జా, పేటా, జిగర్ తండా, జిగర్ తండా డబుల్ ఎక్స్’ వంటి హిట్ చిత్రాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. హీరో సూర్యకి ఇది 44వ చిత్రం. అయితే ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు.
సినిమా ప్రకటించిన సందర్భంగా ‘లవ్... లాఫ్టర్... వార్...’ (ప్రేమ.. నవ్వు.. యుద్ధం) అని ఉన్న పోస్టర్‌ని ఎక్స్‌లో షేర్ చేశారు కార్తీక్ సుబ్బరాజు. త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటిస్తారు. ఈ చిత్రాన్ని సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కార్తీక్ సుబ్బరాజు స్టోన్ బెంచ్ క్రియేషన్స్ నిర్మించనున్నాయి. ఇక ప్రస్తుతం శివ దర్శకత్వంలో ‘కంగువ’ చిత్రంలో నటిస్తున్న సూర్య తనకు ‘ఆకాశం నీ హద్దు రా’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన సుధ కొంగర దర్శకత్వంలో ఓ సినిమాకి పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment