కోలీవుడ్‌ ఎంట్రీ! | Mrunal Thakur to make her Kollywood debut with Suriya 24 | Sakshi
Sakshi News home page

కోలీవుడ్‌ ఎంట్రీ!

Published Mon, Jan 30 2023 4:11 AM | Last Updated on Mon, Jan 30 2023 4:11 AM

Mrunal Thakur to make her Kollywood debut with Suriya 24 - Sakshi

‘సీతారామం’(2022) సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమై తెలుగు ప్రేక్షకుల మనసు గెల్చుకున్నారు బాలీవుడ్‌ నటి మృణాల్‌ ఠాకూర్‌. ఈ బ్యూటీకి ఇప్పుడు కోలీవుడ్‌(తమిళ ఇండస్ట్రీ) నుంచి కబురొచ్చిందట. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో ఓ హిస్టారికల్‌ బ్యాక్‌డ్రాప్‌ ఫిల్మ్‌ రూపొందుతోంది. ఈ సినిమాలో దిశా పటానీ ఓ హీరోయిన్‌.

కాగా ఈ మూవీలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ సన్నివేశాల్లో సూర్య సరసన నటించేందుకు మరో హీరోయిన్‌కి అవకాశం ఉందట. ఈ రోల్‌లోనే మృణాల్‌ ఠాకూర్‌ నటించనున్నారని కోలీవుడ్‌ టాక్‌. అంతేకాదు.. ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌లో మృణాల్‌ జాయిన్‌ అవుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం ఖరారు అయితే కోలీవుడ్‌లో ఆమెకు ఇదే తొలి ప్రాజెక్టు అవుతుంది. కాగా తెలుగులో నాని హీరోగా నటించనున్న ఓ కొత్త సినిమాలో మృణాళ్‌ హీరోయిన్‌గా నటించనున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement