Buzz: Trivikram Upcoming Movie With Suriya On Cards Soon - Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌ ఎంట్రీకి సూర్య రెడీ.. ఆ దర్శకుడుతో సెట్‌ అయ్యేనా!

Published Fri, Jun 25 2021 1:19 PM | Last Updated on Fri, Jun 25 2021 4:09 PM

Suriya To Team Up With Director Trivikram Srinivas - Sakshi

ఈ మధ్యకాలంలో తమిళ్‌లో సూర్య సినిమాలు అంతగా వర్క్‌ అవుట్‌ కావడం లేదు. అక్కడే కాదు ఇక్కడ తెలుగులో కూడా అతడి సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో సూర్య నేరుగా తెలుగు ప్రేక్షకులను పలకరించాలని నిర్ణయించుకున్నాడట. ఇందుకోసం తెలుగు స్టార్‌ డైరెక్టర్లతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల సూర్య బోయపాటి శ్రీనుతో తెలుగులో ఓ మూవీ చేస్తున్నట్లు వార్తలు వెలువడగా అందులో నిజం లేదని తెలింది. ఇక తాజా సమాచారం ప్రకారం సూర్య మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమాకు ప్లాన్‌ చేస్తున్నాడట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement