
నటుడు విమల్ కథానాయకుడిగా నటించిన చిత్రం కులస్వామి. నటి తాన్యా హప్ నాయకిగా నటించిన ఇందులో దర్శకుడు శరవణశక్తి కొడుకు సూర్య ప్రతినాయకుడిగా, ఐపీసెస్ అధికారి ఎస్.ఆర్.జాంగిడ్ ముఖ్య పాత్రలో నటించారు. ఎంఐకే ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి శ్రవణ శక్తి దర్శకత్వం వహించారు. మహాలింగం సంగీతాన్ని, వైడ్ యాంగిల్ రవి ఛాయాగ్రహణం అందించిన ఈచిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 21వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా సోమారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దర్శకుడు, నటుడు అమీర్ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ దర్శకుడు శరవణశక్తి తనకి మంచి మిత్రుడని పేర్కొన్నారు. ఓ చిత్రంలో ఇద్దరు కలిసి నటిస్తున్నపుపడు తాను, దర్శకుడు, నటుడు అయిన కొన్ని ఘటనలు ఎదురైనప్పడు శరవణశక్తి, నటుడు ఇమాన్ అన్నాత్తే తోడుగా ఉండి సంతోషపరిచేవారన్నారు. నటుడు శరవణశక్తి మంచి ప్రతిభావంతుడని పేర్కొన్నారు.
ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ లాంటి చిత్రాన్నే ప్రమోషన్ పేరుతో ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి అన్నారు. కోట్ల రూపాయలు తీసుకుంటున్న నటీనటులు ఊరూరా తిరుగుతూ ప్రమోషన్ చేస్తున్నారని ప్రస్తుత సినిమా పరిస్థితి ఇదేనని అన్నారు. అలాంటిది ఈ చిత్రం హీరో హీరోయిన్లు ఈ వేదికపై ఉండాల్సిందన్నారు. వారు ఇందులో పాల్గొనక పోవడం విచారకరమన్నారు. అయితే ఆ లోటును ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ జాంగిడ్ తీర్చారని అమీర్ పేర్కొన్నారు.