
‘అరవాన్’ (తెలుగులో ‘ఏకవీర’), ‘కావియ తలైవన్’ వంటి హిస్టారికల్ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు దర్శకుడు వసంతబాలన్. ఇటీవల హీరో సూర్యను కలిసి ఓ స్టోరీ లైన్ వినిపించారట వసంత బాలన్. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ స్టోరీలైన్ సూర్యకు నచ్చిందని సమాచారం. త్వరలో పూర్తి కథను సిద్ధం చేసి, సూర్యకు చెప్పబోతున్నారనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. మరి.. వీరి కాంబినేషన్‌లో సినిమా ఉంటుందా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం పాండిరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు సూర్య. అలాగే వెట్రిమారన్, ‘సింగమ్ సిరీస్’ ఫేమ్ హరి దర్శకత్వాల్లో సినిమాలు కమిట్ అయ్యారు. ఈ సినిమాలను పూర్తి చేసిన తర్వాతే వసంతబాలన్‌తో సినిమా చేయాలని అనుకుంటున్నారట సూర్య.
చదవండి:
‘శర్వానంద్ కెరీర్‌లోనే హయ్యస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ మూవీ శ్రీకారం’
టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం
Comments
Please login to add a commentAdd a comment