Reel Life
-
Social Media: ఈ వ్యసనం ప్రాణాంతకం
15 సెకన్ల రీల్స్ కోసం నూరేళ్ల జీవితాన్ని పణంగా పెడుతోంది నేటి యువత. రీల్స్‌ను ప్రవేశపెట్టిన ఇన్ స్టాగ్రామ్‌కు నేడు మన దేశంలో 24 కోట్ల మంది ఖాతాదార్లు ఉన్నారు. వీరిలో యువతీ యువకులే ఎక్కువ. ఆన్ లైన్ ఫేమ్ కోసం చిత్ర విచిత్రమైన రీల్స్ చేయడానికి ప్రాణాలతో రిస్క్ చేస్తున్నారు. గొడవలు, మర్డర్లు జరుగుతున్నాయి. మంచి ఫోన్ల కోసం దొంగలుగా మారుతున్నారు. తల్లిదండ్రులు, సమాజం ఈ వ్యసనాన్ని ఇలాగే వదిలేయాలా?పూణెలో పోలీసులు వెంటనే స్పందించారు. మిహిర్ గాంధీ (27), మీనాక్షి సలూంఖే (23)లను అరెస్ట్ చేశారు. వీరి మీద ఐ.పి.సి 336 సెక్షన్ కింద కేసు పెట్టారు. దీని ప్రకారం ఆరు నెలలకు తగ్గకుండా జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ ఉంటాయి. ఎందుకు వీరిని అరెస్ట్ చేశారు. ప్రాణాంతకమైన రీల్ చేశారు కనుక.ఏం జరిగింది?పూణెకు చెందిన మిహిర్ గాంధీ, మీనాక్షి వారం క్రితం ఒక రీల్ విడుదల చేశారు. అందులో ఎత్తయిన భవంతి మీద మిహిర్ ఉంటే అతని చేయి ఆధారంగా మీనాక్షి గాల్లో వేలాడింది. అతను వదిలేసినా ఆమె చేయి జారినా మీనాక్షి కచ్చితంగా చనిపోయి ఉండేది. ఈ రీల్ బయటకు రాగానే అందరూ మండి పడ్డారు. ఈ రీల్స్ పిచ్చికి శిక్ష పడాలని డిమాండ్ చేశారు. వెంటనే పోలీసులు స్పందించారు. వాటర్ ట్యాంక్ ఎక్కి...ఇటీవల లక్నోలోని వాటర్ ట్యాంక్ ఎక్కి రీల్ చేయబోయిన శివాంశ్ అనే కుర్రాడు కాలు జారి పడి మరణించాడు. దాంతో లక్నోలో పెద్ద ఎత్తున రీల్స్ అడిక్షన్ మీద చర్చ జరిగింది. ఇలా రీల్స్ చేస్తున్న వారికి గౌరవ మర్యాదలు ఇవ్వడం మానేయాలని తల్లిదండ్రులు, సమాజం అందరూ కోరారు. ఇలాగే రాజస్థాన్‌లోని పాలిలో ఒక యువకుడు తన తల్లిదండ్రులతో కలిసి ఒక రీల్ చేయాలనుకున్నాడు. తల్లిదండ్రులు వారించేసరికి కోపమొచ్చి వారిని చంపేశాడు. టీనేజ్ యువతీ యువకులు ఇలా మతిలేని పనులు చేస్తున్నారనుకున్నా వైవాహిక జీవితంలో ఉన్న స్త్రీలు, పురుషులు కూడా రీల్స్‌కు బలవుతున్నారు. చత్తిస్‌గఢ్‌లోని భిలాయ్‌కి చెందిన ఒక మహిళ రీల్స్ చేయడానికి అడిక్ట్ అయ్యి భర్త వారించాడని ఆత్మహత్య చేసుకుంది. కర్నాటకలో ఒక భార్య రీల్ కోసం కన్నడ గీతానికి గంతులేసిందని మనసు నొచ్చుకున్న భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. బిహార్‌లో రీల్స్ వద్దన్నందుకు భర్తనే చంపేసింది మరో మహిళ. రీల్స్ కోసం యువతీ యువకులు రకరకాల డ్రస్సులు వేసుకోవడం, ప్రాంక్‌లు చేయడం, ట్రాఫిక్‌లో ప్రమాదకరమైన ఫీట్లు చేయడం చివాట్లు తినడం ఆనవాయితీగా ఉంది. సమర్థమైన మంచి కంటెంట్‌తో కొందరు గుర్తింపు పొంది లాభపడుతున్నా మరెందరో ఈ రీల్స్ అనే వధ్యశిలపై తలలు తెగిపడుతున్నారు.గుర్తింపు కోసం పోరాటం...గతంలో డార్విన్ మనుగడ కోసం పోరాటం అన్నాడు. ఇవాళ ప్రభుత్వ పథకాల వల్ల మనుగడకు ఢోకా లేదు. ఇక మిగిలింది గుర్తింపు. టీనేజ్‌లో ఉన్న యువతీ యువకులకు గుర్తింప బడాలన్న కోరిక విపరీతంగా ఉంటుంది. గతంలో బాగా చదివి, ర్యాంక్ తెచ్చుకుని, మంచి ఉద్యోగం తెచ్చుకుంటే గుర్తింపు వచ్చేది. ఇప్పుడు ఒక్క రీల్‌తో గుర్తింపు వస్తోంది. ఫాలోయెర్ల వల్ల ఇదంతా ‘తమ కుటుంబం’ అనే భావన వారిలో కలుగుతుంది. ఎప్పుడూ కల్పిత ప్రపంచంలో ముక్కూ మొహం ఎరగని వారి కామెంట్ల ద్వారా వారు సంతృప్తి ΄÷ందుతుంటారు. మరిన్ని కామెంట్ల కోసం మరిన్ని రీల్స్ చేయాలి. మరిన్ని రీల్స్ కోసం మరిన్ని రిస్క్‌లు తీసుకోవాలి అనే భావన బలపడుతుంది.253 కోట్ల మంది...ప్రపంచ వ్యాప్తంగా రోజూ 253 కోట్ల మంది రీల్స్ చూస్తున్నారని ఒక అంచనా. 2020లో టిక్‌టాక్ బ్యాన్ అయ్యాక ఇన్స్టాగ్రామ్ రీల్స్‌ను ప్రవేశ పెట్టింది. 15 నుంచి 30 సెకండ్ల వీడియోలు పోస్ట్ చేసుకునే అవకాశం ఇచ్చింది. దాంతో ఇన్‌స్టా ఇన్ఫ్లూయెన్సర్ల పేరుతో కంటెంట్ క్రియేటర్ల పేరుతో గుర్తింపు కోసం అందరూ రంగంలో దిగారు. మన దేశంలో 8 కోట్ల మంది కంటెంట్ క్రియేటర్లు ఉన్నారంటే (కంటెంట్ ద్వారా ఆదాయం పొందాలని చూస్తున్నారంటే) అంతమందికి మంచి కంటెంట్ దొరికే అవకాశం లేదు. అందుకే పిచ్చి స్టంట్స్ చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఒకప్పుడు సెల్ఫీ పిచ్చితో చాలామంది ప్రాణాలు కోల్పోతే ఇప్పుడు రీల్స్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు.సిసలు ప్రపంచంలో...యువతీ యువకులు సిసలైన ప్రపంచంలో ఉండేలా చేస్తే వారిని ఈ రీల్స్ నుంచి బయటకు తేవచ్చు. ‘సోషల్ మీడియా అడిక్షన్ వల్ల ఆత్మహత్య ఆలోచనలతో ఉన్న వారు పెరుగుతున్నారు’ అని సైకియాట్రిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులతో దూరం, నిరుద్యోగం, ఈజీ మనీ కోసం వెంపర్లాట, క్షణిక గుర్తింపుతో వస్తున్న మానసికానందం, విలువల శూన్యత ఇవన్నీ యువతను రీల్స్ వైపు నెడుతున్నాయి. స్నేహితులతో ఆటలు, మాటలు కూడా లేనంతగా (అవతలివారు కూడా ఫోన్లతో బిజీగా ఉండటం వల్ల) ఒంటరితనానికి విరుగుడును సోషల్ మీడియాలో వెతుక్కుంటూ మరింత ఒంటరి ఔతున్నారు. తల్లిదండ్రులు.ఏం చేయాలి?→ కుటుంబం కూచుని సోషల్ మీడియా అడిక్షన్ గురించి మాట్లాడుకోవాలి.→ మనం చేసే రీల్స్ వల్ల కుటుంబానికి మంచిదా చెడ్డదా చర్చించుకోవాలి.→ ఇతరులు తమ గురించి ఏమనుకుంటున్నారో నిజాయితీగా చెప్పే మిత్రుల సలహా అడగాలి.→ పిల్లలు చేసే ప్రతి పనికీ అంగీకారం ఉండదని తల్లిదండ్రులు వారిని ఒప్పించేలా చె΄్పాలి.→ సైకియాట్రీ సాయం పొందాలి.→ విలువలతో కూడిన గుర్తింపు, గౌరవం మాత్రమే శాశ్వతమని తెలుసుకోవాలి. -
విద్యార్థులే కానీ... వేసవి సెలవులు లేవు
వేసవి వస్తే విద్యార్థులు రిలాక్స్ అవుతారు. వేసవి సెలవులను ఆస్వాదిస్తారు. కానీ.. ఈ విద్యార్థులకు మాత్రం వేసవి సెలవులు లేవు. కాలేజీలకు వెళుతున్నారు. ఎందుకంటే వీళ్లు రియల్ స్టూడెంట్స్ కాదు.. రీల్ స్టూడెంట్స్. కొందరు స్టార్స్ ప్రస్తుతం స్టూడెంట్స్‌గా నటిస్తున్నారు. షూటింగ్ సెట్స్‌లో క్లాసులకు హాజరు అవుతున్నవారు కొందరైతే.. ప్రిపరేషన్ స్టూడెంట్స్ మరికొందరు. ఈ విద్యార్థుల గురించి తెలుసుకుందాం. ► కెరీర్లో పలు చిత్రాల్లో కాలేజ్ స్టూడెంట్‌గా నటించారు హీరో సూర్య. కానీ ఐదు పదుల వయసుకి చేరువ అవుతున్న టైమ్‌లో కూడా కాలేజ్‌కి వెళ్లెందుకు రెడీ అవుతున్నారు. ‘సూరరై ΄ోట్రు’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో సూర్య, దర్శకురాలు సుధ కొంగర కాంబినేషన్లో ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. స్టూడెంట్ నుంచి గ్యాంగ్‌స్టర్‌గా మారే ఓ వ్యక్తి జీవితం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందట. స్టూడెంట్ రోల్ కోసం ప్రస్తుతం సూర్య బరువు తగ్గుతున్నారని సమాచారం. 2డీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది. ►కాలేజీ స్టూడెంట్ రోల్ హీరోయిన్ రష్మికా మందన్నాకు బాగా కలిసి వస్తుందని చె΄÷్పచ్చు. ఆ మాటకొస్తే... నటిగా రష్మికా మందన్నా కెరీర్ మొదలైంది కన్నడ హిట్ క్యాంపస్ డ్రామా ‘కిర్రిక్ పార్టీ’ సినిమాతోనే. అంతేకాదు...రష్మికా మందన్నా తెలుగు ఎంట్రీ మూవీ ‘ఛలో’లోనూ, రెండో మూవీ ‘గీత గోవిందం’లోనూ ఆమెది కాలేజీ స్టూడెంట్ రోల్. ఇలా కాలేజీ స్టూడెంట్‌గా రష్మికా మందన్నా చేసిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్స్. తాజాగా ఈ కోవలో రష్మికా మందన్నా చేస్తున్న చిత్రం ‘ది గాళ్‌ఫ్రెండ్’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా పీజీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ రోల్లో కనిపిస్తారని తెలిసింది. ఆమె బాయ్ ఫ్రెండ్‌గా దీక్షిత్ శెట్టి నటిస్తున్నారు. ఓ కాలేజీ స్టూడెంట్ తన ప్రేమను నెగ్గించుకునే క్రమంలో పడిన సంఘర్షణ నేపథ్యంతో ఈ సినిమా ఉంటుందట. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ‘చి..ల..సౌ’తో దర్శకుడిగా తొలి సినిమాతోనే హిట్ కొట్టిన రాహుల్ రవీంద్రన్ ‘ది గాళ్ ఫ్రెండ్’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజయ్యే చాన్స్ ఉంది. ► కాలేజీలో ఓ ఫెయిల్యూర్ స్టూడెంట్‌గా తెరపై శ్రీ విష్ణు కనిపించిన ప్రతిసారీ ఆయనకు మంచి పేరు వచ్చింది. ‘నీదీ నాది ఒకే కథ’, ‘బ్రోచేవారెవరురా’ వంటి సినిమాల్లో శ్రీ విష్ణు స్టూడెంట్‌గా నటించారు. మళ్లీ ఈ తరహా పాత్రలో శ్రీవిష్ణు హీరోగా నటించిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’. శ్రీవిష్ణుతో పాటు ఈ చిత్రంలో రాహుల్ రవీంద్రన్, ప్రియదర్శి ఇతర లీడ్ రోల్స్ చేశారు. ఓ యూనివర్సిటీలోని ముగ్గురు పీహెచ్డీ స్కాలర్స్ జీవితాలు ఓ ఘటనతో సడన్‌గా ఏ విధంగా మలుపు తిరిగాయి? అనే కోణంలో ఈ చిత్రం ఉంటుంది. ఈ సినిమా ఫస్టాఫ్‌లో కాలేజీ సీన్స్ ఉంటాయి. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో వి సెల్యూలాయిడ్, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. స్టూడెంట్‌గా ఇన్నాళ్లూ సెట్లో బిజీగా ఉన్న శ్రీవిష్ణు ఇప్పుడు ఈ చిత్రం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంటున్నారు. ► ‘ఏవండీ.. (మృణాల్ ఠాకూర్).. రామచంద్రా.. (చిన్న వాయిస్‌తో విజయ్ దేవరకొండ).. నేను కాలేజ్‌కి వెళ్లాలి.. కొంచెం దించేస్తారా? (మృణాల్ ఠాకూర్),.. ఒక లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా..’ (విజయ్ దేవరకొండ)...‘ఫ్యామిలీస్టార్’ సినిమాలోని డైలాగ్ ఇది. సో.. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కొన్ని సన్నివేశాల్లో కాలేజ్‌కి వెళతారని కన్ఫార్మ్ చేసుకోవచ్చు. ‘గీత గోవిందం’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్లో రూ΄÷ందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఇది. బాలీలో ఓ పాట చిత్రీకరిస్తే ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానుంది. ► ‘ఇగై’ సినిమా కోసం లా పాయింట్స్ చెబుతున్నారు అంజలి. ఎందుకంటే ఈ సినిమాలో అంజలి లా స్టూడెంట్. అశోక్ వేలాయుదం దర్శకత్వంలో రూ΄÷ందుతున్న ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలో మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నారు అంజలి. చిత్రీకరణ ్రపారంభమైంది. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ నటీనటులే కాక.. మరికొందరు కూడా కాలేజీ స్టూడెంట్ రోల్స్ చేస్తున్నారు. -
రీల్ లైఫ్‌లోనే అలా ఉంటా!
నటి తమన్నా పేరు వినగానే దర్శక నిర్మాతలకు ముందు గుర్తుకొచ్చేది గ్లామరేనట. మొదట వేరే నటిని అనుకుని ఆ తరువాత నటి తమన్నాను ఆ పాత్రకు ఎంపిక చేస్తే ఆమెను దృష్టిలో పెట్టుకుని అదనంగా కొన్ని గ్లామర్ సన్నివేశాలను చిత్రంలో చేర్చుతున్నారట. ఈ విషయాన్ని తమన్నా తన సన్నిహితుల వద్ద చెప్పుకుని వాపోతున్నారట. ఇటీవల దర్శకుడు సురాజ్ హీరోయిన్లకు కోట్ల రూపాయలు పారితోషికం ఇచ్చేది అందాలారబోత కోసమేనని నటి తమన్నాను దృష్టిలో పెట్టుకునే అన్నారన్నది గమనార్హం. ఇమాజినేషన్ పేరుతో దర్శక నిర్మాతలు తమన్నాను పాటల్లో కురచ దుస్తుల్లో చూపించడానికి మ్యాగ్జిమమ్ ప్రయత్నిస్తుంటారు. ఆమె కూడా అలాంటి పాత్రలకు న్యాయం చేయడానికి ఏమాత్రం సంకోచించరంటున్నారు సినీ వర్గాలు. తమన్నా కథానాయకి అయితే ఆ చిత్రంలో గ్లామర్‌కు కొరత ఉండదు అని యువత అనుకుంటున్నారంటే ఆమె ఎక్స్పోజింగ్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే తాను రీల్ లైఫ్‌లోనే అలా గ్లామర్‌గా కనిపిస్తానని, రియల్ లైఫ్‌లో సంసార పక్ష దుస్తులనే ధరిస్తానని తమన్నా అంటున్నారు. ఒక్కోసారి మోడరన్ దుస్తులు ధరించినా చూసేవాళ్లు గౌరవించే విధంగానే అవి ఉంటాయంటున్న తమన్నా సినిమాల్లోనే కురుచ దుస్తులతో తన ఇమేజ్‌కు భంగం కలిగేలా చేస్తున్నారని వాపోతున్నారట. అయితే బాహుబలి చిత్రంలో అందాలతోపాటు అభినయాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకున్న తమన్నా భవిష్యత్తులోనైనా ఆ తరహా శక్తివంతమైన పాత్రల్లో నటించాలని ఆశ పడుతున్నారట. అంతే కాదు తనకు ఇష్టమైన దర్శకులను వైవిధ్యభరిత పాత్రల్లో నటించే అవకాశాలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. మరి తన కోరికను ఆ దర్శకులు ఏపాటి నెరవేరుస్తారో వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఈ అమ్మడు శింబుకు జంటగా అన్బానవన్ అసరాధవన్ అడంగాధవన్ చిత్రంలో నటిస్తున్నారు. బాహుబలి–2 చిత్రం ఏప్రిల్ 28న తెరపైకి రానుంది. -
కలిసిన హృదయాలు
రీల్ లైఫ్‌లో రొమాన్స్‌లతో కెపైక్కించే తారలు రియల్ లైఫ్‌లోనూ వాటిని కంటిన్యూ చేస్తున్నారు. ఒకటి రెండు సినిమాలు కలసి చేస్తే... హిట్ పెయిర్ అవుతుందో లేదో గానీ.. వారి మధ్య పండిన ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రం ఆపై పర్సనల్‌గానూ వర్కవుటయిపోతోంది. ఒకటా రెండా... వందేళ్లు పైబడిన బాలీవుడ్లో ఇలాంటి కథలు లెక్కకు మించి! ఆనాటి నుంచి ఈనాటి వరకు లవ్... లైఫ్‌లో రొటీనైపోయింది. షూటింగ్‌ల్లో చిగురించిన ప్రేమ కొందరిని భార్యాభర్తలను చేసింది. ఇంకొందరిని ప్రేమికులుగానే వదిలేసింది. మరికొందరిని విరహంలో ముంచెత్తింది. మరి ఈ వాలంటైన్స్ డే సందర్భంగా ప్రేమ ‘హాట్’ సీట్లో ఉన్న బాలీవుడ్ జంటలపై ఓ లుక్కేద్దాం! హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో లవ్ అఫైర్స్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చే స్టార్ జంట కత్రినా కైఫ్, రణబీర్‌కపూర్. దాదాపు ఏడాదికి పైగా ఇద్దరూ కలసి చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. షూటింగ్‌ల్లో ఎవరికి వారు బిజీగా ఉన్నా... వెసులుబాటు చేసుకుని మరీ కలుస్తున్నారు. న్యూ ఇయర్ రోజు లండన్‌లోని కత్రినా ఫ్యామిలీని రణబీర్ కలిశాడన్నది పెద్ద వార్త. అక్కడ పెళ్లి ముచ్చట్లు కూడా జరిగిపోయాయని ఇండస్ట్రీ అప్పట్లో టాకేసింది. మరికొందరు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందన్నారు. కానీ.. రణబీర్ వీటన్నింటినీ ఖండించాడు. ఇక రణబీర్ మాజీ ప్రియురాలు, సూపర్ హీరోయిన్ దీపిక పడుకొనే తాజాగా మరొకరితో లవ్‌లో పడింది. ధోనీ, యువరాజ్‌లతో కొంతకాలం డేటింగ్ చేసిన ఈ అమ్మడు తాజాగా కుర్ర హీరో రణవీర్‌సింగ్‌తో కలసి తెగ తిరిగేస్తోంది. ఆ మధ్య దీపిక బర్త్‌డే బెంగళూరులో జరుపుకుంటే... మనోడు అటెండయ్యాడు. అంతటితో ఆగలేదు.. తన ప్రేమను చాటుకోవడానికి పొడుగు కాళ్ల సుందరిని వెంట పెట్టుకుని షాపింగ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ కాస్ట్లీ ఐటెమేదో కొనిపెట్టాడట కూడా. రీసెంట్గా ఈ చిన్నదాని బుగ్గపై పబ్లిక్‌గా ముద్దు పెట్టి వివాదాల్లో ఇరుక్కున్నాడు. అతికి అసలు అర్థం ఎవరంటే బాలీవుడ్ జనాలు రణవీర్ పేరు చెబుతారు. బహుశా అదే ఆమెకు అతిగా నచ్చేసిందేమో! నాకెవరూ లేరు.. నేను ఒంటరినే అంటూ నిన్నమొన్నటి వరకూ చెప్పుకొచ్చిన సెక్సీ తార బిపాసాబసు తాజాగా తానూ జతగాడిని వెతుక్కుందట. రొమాంటిక్ హీరో జాన్ అబ్రహంతో చాన్నాళ్లు రొమాన్స్ చేసిన బిప్.. ఆ తరువాత కోస్టార్ హర్మాన్ బవేజాతో తిరిగింది. ఇప్పుడు మరో కుర్ర హీరో కరణ్‌సింగ్ గ్రోవర్తో రిలేషన్ మెయిన్‌టెయిన్ చేస్తోంది. మొత్తానికి లేదు లేదంటూనే డేటింగ్ల్లో గడిపేస్తూ ఎంజాయ్ చేస్తోంది బిప్! బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్‌ఖాన్ సీజన్‌కో గాళ్‌ఫ్రెండ్‌ను మారుస్తుంటాడు. అతగాడి లిస్ట్ చెప్పాలంటే బారెడు! ఐశ్వర్యా, కత్రినా, జాక్వెలిన్... ఇలా పెరుగుతూనే ఉంటుంది. అయితే ఇటీవల తన చెల్లి అర్పితాఖాన్ మ్యారేజ్‌లో రొమేనియన్ టీవీ హోస్ట్ లులియా వంతూర్ను ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేసి షాకిచ్చాడు. ఇరువురూ డేటింగ్లో ఉన్నారనేది అసలు విషయం. ఇటు సినిమా ఫీల్డ్... అటు క్రికెట్ గ్రౌండ్లో ఫేమస్ ఫిగర్లు అనుష్కాశర్మా, విరాట్ కొహ్లీల ప్రేమాయణం ఓ రేంజ్లో సాగుతోంది. జతగాడు ఆస్ట్రేలియా టూర్లో ఉంటే... న్యూఇయర్ పార్టీ కోసం అక్కడికి వెళ్లిపోయింది. అనుష్కా కొన్ని రోజులు విరాట్‌తో ఆసీస్ బీచ్‌లు, క్లబ్‌ల్లో షికార్లు కొట్టి వచ్చింది. నిజమెంతో తెలియదు గానీ... ఈ ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని టాక్. సోగకళ్ల చిన్నది సోనాక్షి సిన్హా పెద్దగా వార్తల్లో ఉండదు గానీ... బోనీకపూర్ కొడుకు అర్జున్‌కపూర్‌తో సీక్రెట్‌గా డేటింగ్ సాగిస్తోందని బీటౌన్ టాక్. ఇద్దరూ సినిమాలకు, షికార్లకు వెళ్లినట్టు సమాచారం. అయితే కలసి సినిమా చూసినంత మాత్రాన ఏదో జరిగిపోతున్నట్టేనా అంటూ ప్రశ్నించి కాస్త కన్ఫ్యూజన్లో పెట్టింది సోనాక్షి. వర్ధమాన తారల్లో శ్రద్ధాకపూర్ సహనటుడు ఆదిత్యారాయ్కపూర్తో అఫైర్ నడిపిస్తోందట. ఈ ప్రేమల్లో ఎన్ని సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతాయో తెలుసుకోవాలంటే వచ్చే వాలెంటైన్ డే వరకు ఆగాల్సిందే!