రీల్‌ లైఫ్‌లోనే అలా ఉంటా! | Glamor roles in my Reel Life : Tamanna | Sakshi
Sakshi News home page

రీల్‌ లైఫ్‌లోనే అలా ఉంటా!

Published Thu, Mar 30 2017 3:27 AM | Last Updated on Tue, Sep 5 2017 7:25 AM

రీల్‌ లైఫ్‌లోనే అలా ఉంటా!

రీల్‌ లైఫ్‌లోనే అలా ఉంటా!

 నటి తమన్నా పేరు వినగానే దర్శక నిర్మాతలకు ముందు గుర్తుకొచ్చేది గ్లామరేనట. మొదట వేరే నటిని అనుకుని ఆ తరువాత నటి తమన్నాను ఆ పాత్రకు ఎంపిక చేస్తే ఆమెను దృష్టిలో పెట్టుకుని అదనంగా కొన్ని గ్లామర్‌ సన్నివేశాలను చిత్రంలో చేర్చుతున్నారట. ఈ విషయాన్ని తమన్నా తన సన్నిహితుల వద్ద చెప్పుకుని వాపోతున్నారట. ఇటీవల దర్శకుడు సురాజ్‌ హీరోయిన్లకు కోట్ల రూపాయలు పారితోషికం ఇచ్చేది అందాలారబోత కోసమేనని నటి తమన్నాను దృష్టిలో పెట్టుకునే అన్నారన్నది గమనార్హం.

 ఇమాజినేషన్‌ పేరుతో దర్శక నిర్మాతలు తమన్నాను పాటల్లో కురచ దుస్తుల్లో చూపించడానికి మ్యాగ్జిమమ్‌ ప్రయత్నిస్తుంటారు. ఆమె కూడా అలాంటి పాత్రలకు న్యాయం చేయడానికి ఏమాత్రం సంకోచించరంటున్నారు సినీ వర్గాలు. తమన్నా కథానాయకి అయితే ఆ చిత్రంలో గ్లామర్‌కు కొరత ఉండదు అని యువత అనుకుంటున్నారంటే ఆమె ఎక్స్‌పోజింగ్‌ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

 అయితే తాను రీల్‌ లైఫ్‌లోనే అలా గ్లామర్‌గా కనిపిస్తానని, రియల్‌ లైఫ్‌లో సంసార పక్ష దుస్తులనే ధరిస్తానని తమన్నా అంటున్నారు. ఒక్కోసారి మోడరన్‌ దుస్తులు ధరించినా చూసేవాళ్లు గౌరవించే విధంగానే అవి ఉంటాయంటున్న తమన్నా సినిమాల్లోనే కురుచ దుస్తులతో తన ఇమేజ్‌కు భంగం కలిగేలా చేస్తున్నారని వాపోతున్నారట. అయితే బాహుబలి చిత్రంలో అందాలతోపాటు అభినయాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకున్న తమన్నా భవిష్యత్తులోనైనా ఆ తరహా శక్తివంతమైన పాత్రల్లో నటించాలని ఆశ పడుతున్నారట.

అంతే కాదు తనకు ఇష్టమైన దర్శకులను వైవిధ్యభరిత పాత్రల్లో నటించే అవకాశాలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. మరి తన కోరికను ఆ దర్శకులు ఏపాటి నెరవేరుస్తారో వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఈ అమ్మడు శింబుకు జంటగా అన్బానవన్‌ అసరాధవన్‌ అడంగాధవన్‌ చిత్రంలో నటిస్తున్నారు. బాహుబలి–2 చిత్రం ఏప్రిల్‌ 28న తెరపైకి రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement