గ్లామరస్‌ పాత్రలలో ఎందుకు నటించనంటే..: ఐశ్వర్య రాజేశ్‌ | Aishwarya Rajesh Interesting Comments On Glamorous Characters In Her Movies, Deets Inside | Sakshi
Sakshi News home page

Aishwarya Rajesh: గ్లామరస్‌ పాత్రలలో ఎందుకు నటించనంటే..

Published Sun, Jul 21 2024 6:41 PM | Last Updated on Mon, Jul 22 2024 10:40 AM

Aishwarya Rajesh Comments On Glamour Characters

ఐశ్వర్య రాజేశ్‌... దక్షిణాది సినిమాలో స్టార్‌ హీరోయిన్‌. చిన్నచిన్న పాత్రలతో అంచెలంచెలుగా ఎదిగి లేడీ ఓరియంటెండ్‌ కథా చిత్రాలు చేసే స్థాయికి ఎదిగారు. యంగ్‌ ఏజ్‌లోనే కాక్కా ముట్టై చిత్రంలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించి ఆ పాత్రకు జీవం పోశారు. ఆ చిత్రమే ఐశ్వర్య రాజేశ్‌ కేరీర్‌కు పెద్ద టర్నింగ్‌ పాయింట్‌ అయ్యింది. అయితే,  సినిమా అనేది గ్లామర్‌ ప్రపంచం అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హీరోయిన్లను గ్లామర్‌గా చూపించడానికే దర్శక నిర్మాతలు యత్నిస్తుంటారు. ఇక చాలామంది హీరోయిన్లు గ్లామర్‌నే నమ్ముకుంటారన్నది వాస్తవం. 

అయితే, అందుకు భిన్నంగా ఉండే అతికొద్ది మంది హీరోయిన్లలో నటి ఐశ్వర్యరాజేశ్‌ ఒకరు.  కోలీవుడ్‌లో ఐశ్వర్యరాజేశ్‌కు అంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ ఉంది. ఉమెన్స్‌ సెంట్రిక్‌ కథా పాత్రల్లో నటిస్తూ వరుసగా చిత్రాలు చేసిన ఈమె ప్రస్తుతం తెలుగు, కన్నడ భాషల్లో నటించడంతో తమిళంలో చిత్రాలు తగ్గాయి. కాగా ఇటీవల విదేశాలకు వెళ్లిన ఐశ్వర్యరాజేశ్‌ అక్కడ నుంచి గ్లామరస్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. దీంతో ఐశ్వర్య రాజేశ్‌ కూడా గ్లామర్‌కు మారిపోయారనే ప్రచారం హల్‌చల్‌ చేస్తోంది. కాగా ఈమె ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ గ్లామర్‌ పాత్రల్లో నటించమని తనకు చాలా అవకాశాలు వచ్చాయన్నారు. 

కానీ, తాను అలాంటి పాత్రల్లో నటించడానికి అంగీకరించలేదన్నారు. తనకు తగిన పాత్రల్లో నటించడమే తనకు ఇష్టం అని పేర్కొన్నారు. గ్లామరస్‌గా నటించడం తనకు తగదన్నారు. అందుకే గ్లామరస్‌ పాత్రల్లో నటించడానికి మొగ్గు చూపడం లేదన్నారు. తనకు కుటుంబ కథా చిత్రాలే కావాలనీ, అందులోనూ నటనకు అవకాశం ఉండాలనీ కోరుకుంటు న్నాని నటి ఐశ్వర్యరాజేశ్‌ పేర్కొన్నారు. కాగా ఈమె కన్నడంలో శివరాజ్‌ కుమార్‌కు జంటగా నటించిన ఉత్తరఖాండ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈమె నటించిన తొలి కన్నడ చిత్రం ఇదే కావడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement