తమిళసినిమా: ఆరంభ దశలోనే కాక్కాముట్టై త్రంలో ఇద్దరు పిల్లలకు తల్లిగా నటిం తన నట జీవితానికి గట్టి పునాదులు వేసుకున్న నటి ఐశ్వర్యరాజేష్. ఆ తర్వాత కథా బలమున్న చిత్రాల్లో నటిస్త హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల నాయకిగా ఎదిగారు. తాజాగా ఈమె ముగ్గురు పిల్లల తల్లిగా నటించనుండడం విశేషం. ఈ చిత్రం పేరు ఫర్హానా. ఇంతకుముందు ఒరునాళ్ కత్తు, మాన్‌స్టర్ చిత్రాలతో విజĶæలను అందుకున్న దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. వైవిధ్య భరిత కథా చిత్రాలు ని ర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్‌ఆర్ ప్రకాష్, ఎస్‌ఆర్ ప్రభు నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది.
నటి ఐశ్వర్య రాజేష్ టైటిల్ పాత్రను పోషిస్తున్న ఇందులో నటుడు రమేష్ చాలా కీలక పాత్రలో నటిస్తున్నారు. అదేవిధంగా ఐ శ్వర్య దత్ ముఖ్యపాత్ర పోషిస్తున్న ఇందులో దర్శకుడు సెల్వరాఘవన్ స్పె షల్ అపిరెన్స్ ఇవ్వడం విశేషం. దీనికి జస్టిన్ ప్రభాకర్ సంగీతాన్ని, గోకుల్ పినాయ్ చాĶæగ్రహణం అందిస్తున్నారు. చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర వివరాలను దర్శకుడు తె లుపుతూ ఎప్పుడు జనసంచారంతో నిండి ఉండే ప్రాంతం చెన్నైలోని ఐస్‌హౌస్ అన్నారు. ఈ చిత్ర కథానాయిక నివసించే ప్రాంతం అదేనన్నా రు. స్థానిక ప్యారిస్ ప్రాంతం కూడా ఇలానే ఉంటుందన్నారు.
టెక్నాల జీ ఎంత అభివృద్ధి చెందుతున్నా నగరం ఎంతగా విస్తరిస్తున్నా ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో ఎదుగుదలే కనిపించదన్నారు. అ లాంటి ఐస్‌హౌస్ ప్రాంతమే ఫర్హానా చిత్ర నేపథ్యం అ న్నారు. అక్కడ ఒక పేరున్న చెప్పుల దుకాణాన్ని ని ర్వహించే ఐశ్వర్య రాజేష్ కాలానుగుణంగా ఆ వ్యా పారం కుంటుబడడంతో ముగ్గురు పిల్లలతో కూడి న కుటుంబపోషణ నిమిత్తం ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుందన్నారు. అలాంటి ఆమె జీవిత పయనమే ఫర్హానా అని తెలిపారు. ఫర్హానా పాత్రలో ఐశ్వర్యరాజేష్ అద్భుతంగా నటించారని, జిత్త న్ రమేశ్ ప్రాముఖ్యత కలిగిన పాత్రలో నటించారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment