లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలో ఐశ్వర్య రాజేష్‌ | Aishwarya Rajesh Starts Begins Shooting With Director SG Charles | Sakshi
Sakshi News home page

Aishwarya Rajesh: లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలో ఐశ్వర్య రాజేష్‌

Published Thu, Mar 10 2022 11:21 AM | Last Updated on Thu, Mar 10 2022 11:30 AM

Aishwarya Rajesh Starts Begins Shooting With Director SG Charles - Sakshi

నటి ఐశ్వర్య రాజేష్‌ కథానాయుకగా నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్‌ మూవీ బుధవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. హ్యాబాక్స్‌ స్టూడియోస్‌, హంసినీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌జీ చార్లెస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నటి లక్ష్మీప్రియే, నటుడు సునీల్‌రెడ్డి, కరుణాకరన్‌, మైమ్‌ గోపి, దీపాశంకర్‌, కింగ్స్‌ లీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి బాల మురుగన్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

విభిన్న కథా చిత్రాలు ఎంపిక చేసుకుని నటిస్తున్న ఐశ్వర్య రాజేష్‌కు ఈ చిత్రం కచ్చితంగా అవార్డులు, రివార్డులు తెచ్చి పెడుతుందనే అభిప్రాయాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం ఊహించని మలుపులతో కామెడీ, పోరాట దృశ్యాలతో కూడిన జనరంజక కథా చిత్రంగా ఉంటుందన్నారు. త్వరలో చిత్ర టైటిల్‌ తదితర వివరాలను వెల్లడిస్తామన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement