దాదాపు 10 భాషల్లో సూర్య పిరియాడికల్‌ చిత్రం! | Suriya, Disha Patani Periodical Movie Shooting Schedule at Chennai | Sakshi
Sakshi News home page

Hero Suriya: దాదాపు 10 భాషల్లో సూర్య పిరియాడికల్‌ చిత్రం!

Published Mon, Dec 19 2022 3:48 PM | Last Updated on Mon, Dec 19 2022 3:49 PM

Suriya, Disha Patani Periodical Movie Shooting Schedule at Chennai - Sakshi

హీరో సూర్య.. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అదే జోష్‌లో వరుస చిత్రాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం సూర్య డైరెక్టర్‌ చిరుతై శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సూర్య 42వ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీలో బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఎన్నూరు పోర్టు, థర్మల్‌ ప్లాంట్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో సూర్య, దిశాలపై కీలకమైన లవ్‌ ట్రాక్‌ను చిత్రీకరిస్తున్నారు.

చదవండి: బిగ్‌బాస్‌ 6: టాప్‌ 3 కంటెస్టెంట్‌ కీర్తి..15 వారాల రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

ఈ షెడ్యూల్‌లోనే ఓ పాటని కూడా చిత్రీకరించనున్నాడట డైరెక్టర్‌ శివ. కాగా యువీ క్రియేషన్స్‌ అధినేతలు వంశీకృష్ణ, ప్రమోద్‌ స్టూడియో గ్రీన్‌ సంస్థ అధినేత జ్ఞానవేల్‌రాజా కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పీరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమా రెండు భాగాలుగా పదిభాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుందని కోలీవుడ్‌ టాక్‌. కాగా ఈ సినిమా మొదటి భాగాన్ని చిత్ర బృందం వచ్చే ఏడాది రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

చదవండి: మొత్తం బిగ్‌బాస్‌ ద్వారా రేవంత్‌ ఎంత సంపాదించాడో తెలుసా?
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement