బాలీవుడ్ బ్యూటీలు సౌత్ సినిమాల్లో నటించాలని ఆశ పడటం కొత్తేమీ కాదు. సౌత్ వాళ్లు బాలీవుడ్‌లో పాగా వేయాలని తహ తహ లాడుతున్నట్లే, అక్కడి భామలు ఇక్కడి చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇప్పటికే తాప్సీ, హన్సిక, ఇలియానా నటీమణులు కోలీవుడ్లో నటించి పేరు తెచ్చుకున్నారు. తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీ కోలీవుడ్ ఎంట్రీ షురూ అయిందన్నది తాజా సమాచారం. అందాలను విచ్చలవిడిగా ఆరబోస్తూ కురక్రారుకు నిద్ర కరువు చేస్తున్న నటి దిశా పటాని కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వాడినికి రెడీ అంటోందట. ఎంఎస్ ధోని చిత్రంతో అందరిని ఆకట్టుకున్న ఈ చిన్నది ఇప్పుడు కోలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.
ఇక్కడ సూర్యతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది. సూరరై పోట్రు, జై భీమ్ చిత్రాలు ఘన విజయాలతో హీరోగానూ, విరుమన్ చిత్ర విజయంతో నిర్మాతగానూ పుల్ జోష్‌లో ఉన్న సూర్య ప్రస్తుతం బాలా దర్శకత్వంలో వణంగాన్ చిత్రంలో నటిస్తూ, 2డీ – ఎంటర్ టెయిన్‌మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. దీంతోపాటు చిరుతై శివ దర్శకత్వంలో మరో చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీన్ని యువీ క్రియేష¯న్స్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత జ్ఞానవేల్ రాజా నిర్మించనున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. పాన్ ఇండియా చిత్రంగా రూపొందనున్న ఇందులో నటి పూజా హెగ్డే నాయికగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా నటి దిశా పటానిని ఎంపిక చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక పూర్వకంగా ప్రకటన త్వరలో వెలువడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment