ప్రస్తుతం చాలా మంది బాలీవుడ్ బ్యూటీలు దక్షిణాది సినిమాలపై మక్కువ చూపుతున్నారు. ఇక్కడ షూటింగ్ విధానం, ప్రజల అభిమానం వారిని బాగా ఇంప్రెస్ చేస్తోంది. పూజాహెగ్డే వంటి హీరోయిన్లు ఇక్కడ అగ్రస్థానంలో వెలిగిపోతున్నారు. ఇటీవల విడుదలైన బ్రహ్మాస్త్రం చిత్రంలో అలియాభట్ నటన కూడా ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తాజాగా మరో సంచలన నటి దిశా పటాని కోలీవుడ్‌లో ఎంట్రీకి ఉవ్వుర్లూరుతోంది. బాలీవుడ్‌లో ఇటీవల విజయాలు తగ్గాయి. కాగా తాజాగా కోలీవుడ్‌లో హీరో సూర్యకు జంటగా నటించే అవకాశాన్ని దక్కించుకుంది.
సూర్య 42గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో కథానాయకిగా దిశా పటాని నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ రెండవ షెడ్యూల్ మంగళవారం గోవాలో మొదలైంది. నటుడు సూర్య 15వ తేదీ నుంచి ఈ చిత్రంలో పాల్గొననున్నారు. నటి దిశా పటాని కూడా ఈ షెడ్యూల్‌లోనో జాయిన్ అవుతోందట.
కాగా ఈ చిత్రంలో నటించడం గురించి నటి దిశా పటాని ఒక భేటీలో మాట్లాడుతూ సూర్య, దర్శకుడు శివ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంలో నటించడం సంతోషంగా ఉందని తెలిపింది. వెండితెరపై ప్రత్యేక అనుభూతిని కలిగించే ఈచిత్రంలో తాను భాగం కావడం ఆనందంగా ఉందని పేర్కొంది. చారిత్రక కథా నేపథ్యంలో రూపొందుతున్న ఇందులో తన పాత్రకు చాలా ప్రత్యేకత ఉంటుందని చెప్పింది. తాను ఇంతవరకు నటించనటువంటి వినూత్న పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానుండటం థ్రిల్లింగా ఉందని పేర్కొంది. కాగా ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని, వెట్రి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment