హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఫర్హానా. నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్‌ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. అయితే ఫర్హానా చిత్రం ఒక మతాన్ని అవమానించే విధంగా ఉందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్పందించిన చిత్ర నిర్మాతలు గురువారం మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు.
అందులో తమ సంస్థ నుంచి ఇంతకు ముందు పలు ప్రజాదరణ పొందిన కథా చిత్రాలు వచ్చాయన్నారు. వివాదాస్పద కథా చిత్రాలను నిర్మించడం తమ అభిమతం కాదని స్పష్టం చేశారు. అలాంటి ఆలోచనే తమకు లేదన్నారు. ఫర్హానా అందరూ చూడాల్సిన మంచి కథా చిత్రం అన్నారు. సెన్నార్ బోర్డు ధ్రువపత్రాన్ని పొంది విడుదల చేస్తున్న చిత్రమని పేర్కొన్నారు.
అలాంటి చిత్రం గురించి కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా చూడకుండానే దీన్ని వివాదంగా మార్చడం సమంజసం కాదన్నారు. మతసామరస్యానికి చిహ్నం మన తమిళనాడు అని, ఫర్హానా ఏ మతాన్ని కించపరచదని తెలిపారు. మతసామరస్యానికి భంగం కలిగించే ఎలాంటి చిత్రాలను తాము నిర్మించమని పేర్కొన్నారు.
చదవండి: కస్టడీ నా కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తీసిన సినిమా: నాగచైతన్య
Comments
Please login to add a commentAdd a comment