
నువ్వు దానికి వివరణ ఇవ్వాల్సిన పని లేదు. నీపై నాకు ఎంత ప్రేమ, గౌరవం ఉందో నీకు బాగా తెలుసు. ఫర్హానా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చావు కదా! అందుకు ఆ
సెలబ్రిటీలు ఏం మాట్లాడినా, ఏం చేసినా చెల్లుతుందనుకుంటే పొరపాటే! వారు పొరపాటున నోరు జారినా, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించినా విమర్శించేందుకు రెడీగా ఉంటారు నెటిజన్లు. అందుకే చాలామటుకు ఆచితూచి మాట్లాడుతుంటారు. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో వారి మాటలు, చేష్టలు జనాలకు అస్సలు నచ్చదు. ఫలితంగా సెలబ్రిటీలు ట్రోలింగ్ బారిన పడకా తప్పదు!
తెలుగు హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ విషయంలో అదే జరిగింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర తనకు ఇచ్చి ఉంటే రష్మిక మందన్నా కంటే బాగా చేసేదాన్ని అని చెప్పినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీనిపై రష్మిక ఫ్యాన్స్ మండిపడటంతో తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చింది ఐశ్వర్య. 'ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలుగు పరిశ్రమలో ఎలాంటి పాత్రలు పోషించాలని కోరుకుంటున్నారు? అన్న ప్రశ్న ఎదురైంది. దానికి బదులుగా నాకు తెలుగు చిత్రపరిశ్రమ అంటే ఎంతో ఇష్టం. నచ్చిన కథాపాత్రలు వస్తే కచ్చితంగా తెలుగులో నటిస్తానని చెప్పాను.
ఉదాహరణకు పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాత్ర నాకు చాలా నచ్చిందని చెప్పాను. దురదృష్టవశాత్తూ నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు. రష్మిక నటనపై నేను ఎలాంటి కామెంట్ చేయలేదు. సహనటిగా తనపై నాకు ఎంతో అభిమానం ఉంది' అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. తాజాగా ఈ వ్యవహారంపై రష్మిక మందన్నా స్పందించింది. 'హాయ్ లవ్.. ఇప్పుడే చూశానిదంతా! నీ మాటల వెనుక ఉన్న భావాన్ని నేను అర్థం చేసుకోగలను. నువ్వు దానికి వివరణ ఇవ్వాల్సిన పని లేదు. నీపై నాకు ఎంత ప్రేమ, గౌరవం ఉందో నీకు బాగా తెలుసు. ఫర్హానా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చావు కదా! అందుకు ఆల్ ద బెస్ట్' అంటూ హార్ట్ ఎమోజీతో రిప్లై ఇచ్చింది. దీంతో ఈ వివాదానికి తెర పడింది.
From the desk of Aishwarya Rajesh#AishwaryaRajesh @aishu_dil pic.twitter.com/J78oNsWQ9B
— Yuvraaj (@proyuvraaj) May 17, 2023