కోలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లో రాణిస్తున్న అతికొద్ది మంది హీరోయిన్లలో ఐశ్వర్య రాజేశ్ ఒకరు. బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన ఈమె మొదట్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. అలా కాక్కా ముట్టై చిత్రంలో ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రం ఈమె జీవితాన్నే మార్చేసింది. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో చెల్లెలు, అక్క వంటి పాత్రలో నటించినా హీరోయిన్‌గా అవకాశాలు రావడం మొదలుపెట్టాయి.
అలా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ స్థాయిని పెంచిన చిత్రం కనా. ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం. ఆ తరువాత పలు హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాలు వరుసగా రావడం మొదలుపెట్టాయి. అలా ఐశ్వర్య ఖాతాలో కపే రణసింగం మరో హిట్ చిత్రంగా నిలిచింది. ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లో నటిస్తున్న ఐశ్వర్య రాజేశ్ తాజాగా ఆ తరహాలో నటిస్తున్న మరో వైవిధ్య కథా చిత్రం సిస్టర్. ద్వారకా ప్రొడక్షన్స్ పతాకంపై బ్రేజ్ కన్నన్, శ్రీలతా బ్రేజ్ కన్నన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సవరి ముత్తు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
యోగిబాబు, రెడిస్ కింగ్స్ లీ, సునీల్ రెడ్డి, సంతాన భారతి, అర్జున్ చిదంబరం, బక్స్, శేషు, మారన్, ఆదిత్య ఖదిర్, కరాటే కార్తీ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా గత డిసెంబర్ నెలలో ప్రారంభమవగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను ఐశ్వర్య రాజేష్ 34వ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ.. ఇందులో నటి ఐశ్వర్య.. సిస్టర్‌గా నటిస్తున్నారని.. ఆస్పత్రిలో పని చేసే ఒక నర్సు జీవితంలో జరిగే పలు ఆసక్తికరమైన ఘటనలే ఈ సినిమా కథ అని తెలిపారు.
చదవండి: నయనతారపై కేసు, అన్నపూరణి ఆగింది
Comments
Please login to add a commentAdd a comment