
సంగీత దర్శకుడిగా, నటుడి రాణిస్తున్న నటుడు జీవీ ప్రకాశ్ కుమార్. ఈయన హీరోయిజానికే కాకుండా కంటెంట్‌కు ప్రాముఖ్యతనిస్తూ చిత్రాలను చేస్తున్నారు. ఇక సంగీత దర్శకుడిగా తమిళంతోపాటు తెలుగులోనూ దూసుకుపోతున్నారు. త్వరలో అతడు నటి ఐశ్వర్య రాజేష్‌తో సినిమా చేయనున్నట్లు సమాచారం. తొలుత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పరిచయమైన ఐశ్వర్య రాజేశ్ తానేమిటో నిరూపించుకుని కథానాయికగా ఎదిగింది.
ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో బిజీగా ఉంది. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న అతి తక్కువమంది నటీమణుల్లో ఈమె ఒకరు. కాగా శుక్రవారం చెన్నైలో జరిగిన ఫ్రూబే షాపు ప్రారంభోత్సవ వేడుకలో జీవీ ప్రకాశ్ కుమార్, నటి ఐశ్వర్య రాజేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ కాంబినేషన్‌లో సినిమా రానున్నట్లు ధ్రువీకరించారు. ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
చదవండి: ఆ విషయంలో నయనతార కంటే హన్సిక ముందంజ
సుశాంత్ బర్త్‌డే సెలబ్రేట్ చేసిన హీరోయిన్, వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment