ఐశ్వర్య రాజేశ్ మన తెలుగమ్మాయే. కానీ తను తెలుగులో కన్నా తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేస్తోంది. త్వరలో ఆమె ఫర్హానా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఐశ్యర్య మాట్లాడుతూ తెలుగు తెరకు దూరంగా ఉండటానికి గల కారణాన్ని వెల్లడించింది.
'నేను తెలుగమ్మాయినే! మా నాన్న రాజేశ్, తాత తెలుగు సినిమాలు చేశారు. మా అత్త తెలుగులో 500కి పైగా సినిమాలు చేసింది. ఇంట్లో ఎక్కువగా తెలుగులోనే మాట్లాడతాం. అమ్మ ఎప్పుడూ అడిగే ప్రశ్న.. మీ నాన్నగారు తెలుగులో హీరోగా 40 సినిమాలు చేశారు. నువ్వేమో ఒక్క సినిమా కూడా చేయట్లేదు అనేవారు. నేను ఎన్టీఆర్, ఏఎన్నార్‌లకు పెద్ద ఫ్యాన్. మంచి బ్లాక్‌బస్టర్ సినిమాతోనే తెలుగులో ఎంట్రీ ఇవ్వాలనుకున్నా. అలా వరల్డ్ ఫేమస్ లవర్‌తో ఇక్కడ ఎంట్రీ ఇచ్చాను. ఆ తర్వాత రెండు, మూడు సినిమాలు చేశాను.
అప్పటికీ మా అమ్మ మళ్లీ ఓ ప్రశ్న అడిగింది. తమిళంలో మహిళా ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తున్నావు. మరి తెలుగులో ఎందుకు చేయవని ప్రశ్నించింది. అప్పుడు నేనేమన్నానంటే.. తెలుగులో అలాంటి సినిమాలు చేయాలంటే నేను పెద్ద స్టార్ అయి ఉండాలన్నాను. అయితే తెలుగు బిడ్డనయినప్పటికీ నాకు ఇక్కడ పెద్దగా అవకాశాలు రాలేదు. స్టార్ హీరోల సరసన, పెద్ద సినిమాల్లో నటించే ఆఫర్స్ నాకు తక్కువగా వచ్చాయి' అని చెప్పుకొచ్చింది ఐశ్వర్య రాజేశ్.
Comments
Please login to add a commentAdd a comment