కీవ్: రష్యా దురాక్రమణ తమ దేశంపై మొదలయ్యాక 499 మంది చిన్నారులు సహా 10,749 మంది పౌరులు చనిపోయినట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ ఉన్నతాధికారి యూరి బియెలౌసోవ్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. ఆక్రమిత ప్రాంతాలను విముక్తి చేసిన తర్వాతే వాస్తవ సంఖ్య తేలుతుందని చెప్పారు.
రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో 500 మంది చిన్నారులు సహా 9 వేల మందికి పైగా పౌరులు మృతి చెందినట్లు జూలై 7న ఐక్యరాజ్యసమితి వెల్లడించిన నివేదిక తెలిపింది. కాగా, రష్యా కాల్పుల్లో ఖెర్సన్ నగరంలోని 18వ శతాబ్దానికి చెందిన చారిత్రక సెంట్ కేథరిన్ కేథడ్రల్ చర్చి దెబ్బతింది. మంటలను ఆర్పుతుండగా మరోసారి దాడి జరిగింది.
► యుద్ధ ట్యాంకర్‌పై కూర్చున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ నిలువెత్తు రక్త ప్రతిమపై వాటర్ గన్‌తో నీళ్లు పిచికారీ చేస్తున్న ఓ బాలిక. ఇటలీ రాజధాని రోమ్‌లో జేమ్స్ కొలోమినా అనే కళాకారుడు ఈ ప్రతిమను ప్రతిష్టించారు.
Comments
Please login to add a commentAdd a comment