United Nations report
-
యుద్ధ మృతులు 10 వేలు.. ఓ రక్తపిపాసీ... నీకిదే జలాభిషేకం...!
కీవ్: రష్యా దురాక్రమణ తమ దేశంపై మొదలయ్యాక 499 మంది చిన్నారులు సహా 10,749 మంది పౌరులు చనిపోయినట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ ఉన్నతాధికారి యూరి బియెలౌసోవ్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. ఆక్రమిత ప్రాంతాలను విముక్తి చేసిన తర్వాతే వాస్తవ సంఖ్య తేలుతుందని చెప్పారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో 500 మంది చిన్నారులు సహా 9 వేల మందికి పైగా పౌరులు మృతి చెందినట్లు జూలై 7న ఐక్యరాజ్యసమితి వెల్లడించిన నివేదిక తెలిపింది. కాగా, రష్యా కాల్పుల్లో ఖెర్సన్ నగరంలోని 18వ శతాబ్దానికి చెందిన చారిత్రక సెంట్ కేథరిన్ కేథడ్రల్ చర్చి దెబ్బతింది. మంటలను ఆర్పుతుండగా మరోసారి దాడి జరిగింది. ► యుద్ధ ట్యాంకర్‌పై కూర్చున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ నిలువెత్తు రక్త ప్రతిమపై వాటర్ గన్‌తో నీళ్లు పిచికారీ చేస్తున్న ఓ బాలిక. ఇటలీ రాజధాని రోమ్‌లో జేమ్స్ కొలోమినా అనే కళాకారుడు ఈ ప్రతిమను ప్రతిష్టించారు. -
న్యుమోనియానూ ఎదుర్కోలేకపోతున్నాం
ఐక్యరాజ్యసమితి: అదేమి అరికట్టలేని భయంకరమైన వ్యాధి కాదు. చికిత్స లేని ప్రాణాంతకమైన జబ్బు కూడా కాదు. కానీ భారత్ మాత్రం ఆ వ్యాధిని నియంత్రించడంలో చతికిలపడిపోతోంది. అదే న్యుమోనియా. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో వచ్చే ఈ వ్యాధి సోకి ఐదేళ్లలోపు వయసు చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్న దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా న్యుమోనియా ప్రతీ 39 సెకండ్లకు ఒక చిన్నారి ఉసురు తీస్తున్నట్టు యూఎన్ అధ్యయనంలో వెల్లడైంది. 2018లో న్యుమోనియా వ్యాధి సోకి ఎందరు చిన్నారులు బలయ్యారో యూనిసెఫ్ ప్రపంచవ్యాప్తంగా గణాంకాలను సేకరించి ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం అయిదేళ్లలోపు చిన్నారులు అత్యధికంగా న్యుమోనియో సోకి మరణిస్తున్నారు. ఆ దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉండడం ఆందోళన పుట్టిస్తోంది. 2018లో ప్రపంచ దేశాల్లో అయిదేళ్ల లోపు చిన్నారుల్లో 8 లక్షల మందికి పైగా న్యూమోనియా వ్యాధి సోకి ప్రాణాలు కోల్పోయారు. మొదటి నెలలోనే ప్రాణాలు కోల్పోయిన పసివారు లక్షా 53 వేలుగా ఉంది. పేదరికమే కారణం అసలు న్యుమోనియా అన్న వ్యాధి ఉందన్న సంగతి కూడా ఎన్నో దేశాలు మర్చిపోయిన వేళ హఠాత్తుగా కొన్ని దేశాల్లో ఈ వ్యాధి తీవ్రత పెరగడంపై యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. అయిదేళ్ల కంటే తక్కువ వయసున్న వారి మృతుల్లో 15 శాతం న్యుమోనియా కారణంగా నమోదవుతున్నాయని చెప్పింది. పేదరికానికి, ఈ వ్యాధికి గల సంబంధాన్ని కొట్టి పారేయలేమని పేర్కొంది. సురక్షిత మంచినీరు అందుబాటులో లేకపోవడం, ఆరోగ్య సంరక్షణా కేంద్రాలు తక్కువ సంఖ్యలో ఉండడం, పౌష్టికాహార లోపాలు పెరిగిపోవడం, కాలుష్యం కాటేయడం వంటివి న్యుమోనియా పెరిగిపోవడానికి కారణాలుగా యూనిసెఫ్ నివేదిక వెల్లడించింది. న్యుమోనియా మరణాల్లో ఆ దేశాలే టాప్ న్యుమోనియా కారణంగా ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో సగానికి పైగా అయిదు దేశాల్లోనే నమోదవుతున్నాయి. నైజీరి యా, భారత్, పాకిస్తాన్, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇథియోపియా దేశాలే దీనికి బాధ్యత వహించాలని యూఎన్ వెల్లడించింది గత ఏడాది మృతుల సంఖ్య నైజీరియా 1,62,000 భారత్ 1,27,000 పాకిస్తాన్ 58,000 డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో 40,000 ఇథియోపియా 32,000 -
దారిద్య్రం నుంచి విముక్తి చెందారు
ఢిల్లీ: భారత్‌లో దశాబ్ద కాలంలో 27.1 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినట్టు ఐక్యరాజ్య సమితి రూపొందించిన బహుపార్శ్వపు పేదరిక సూచిక (మల్టీడైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ – ఎంపీఐ) వెల్లడించింది. యూఎన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్డీపీ), ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ కలసి రూపొందించిన ఈ సూచిక తాలూకూ నివేదిక ప్రకారం – మన దేశం వేగంగా పేదరికాన్ని తగ్గించగలుగుతోంది. జార్ఖండ్ వేగవంతమైన అభివృద్ధి దిశగా సాగుతోంది. ఆ రాష్ట్రంలో పదేళ్ల(2005–6, 2015–16)కాలంలో పేదరికం 46.5 శాతం మేరకు తగ్గింది. ఇండియా, ఇథియోపియా, పెరూ దేశాలు పేదరికాన్ని తగ్గించడంలో చెప్పుకోదగిన రీతిలో ముందున్నాయి. 101 దేశాల సూచికలను ఈ నివేదికలో పొందుపరిచారు. ఇందులో 31 స్వల్పాదాయ దేశాలు, 68 మధ్యాదాయ దేశాలు. ఆయా దేశాల్లో 130 కోట్ల మంది బహుముఖ పేదరికాన్ని అనుభవిస్తున్నారు. పేదరికాన్ని, అది ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలనేది ఐక్య రాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో మొదటిది. నివేదిక ఈ విషయాన్ని గుర్తు చేస్తూ 200 కోట్ల జనాభా గల 10 దేశాలు (భారత్, బంగ్లాదేశ్, కంబోడియా, కాంగో, ఇథియోపియా, హైతి, నైజీరియా, పాకిస్తాన్, పెరు, వియత్నాం) దశాబ్ది కాలంలో ఈ లక్ష్య సాధన దిశగా చెప్పుకోదగ్గ ప్రగతి సాధించాయని వెల్లడించింది. పై పది దేశాల్లో పట్టణ ప్రాంతాలతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాలు మరింత పేదరికం మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. -
కశ్మీర్‌పై ఐరాస నివేదిక
జెనీవా/న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలకు సంబంధించి ఐక్యరాజ్యసమితి గురువారం ఓ నివేదికను విడుదల చేసింది. కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ విచారణ జరిపించాలని డిమాం డ్ చేసింది. కశ్మీర్‌కు సంబంధించి ఇలాంటి నివేదికను ఐక్యరాజ్యసమితి విడుదల చేయడం ఇదే తొలిసారి. అయితే ఈ నివేదికపై భారత్ ఘాటుగా స్పందించింది. ఇది పూర్తిగా దురుద్దేశంతో కూడిన, మోసపూరితమైన, ఇతరుల ప్రేరణతో నివేదిక రూపొందించినట్లు ఉందంది. ఈ మేరకు భారత ప్రభుత్వం తన వ్యతిరేకతను ఘాటు వ్యాఖ్యలతో ఐరాసకు ఓ లేఖ ద్వారా తెలిపింది. ఈ నివేదిక భారతదేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత లను ఉల్లంఘించేలా ఉందంది. జమ్మూ కశ్మీర్ రాష్ట్రం మొత్తం భారత్‌లో అంతర్భా గమని, పాక్ చట్టవిరుద్ధంగా, దురాక్రమణ ద్వారా భారత్ లోని కొంత భాగాన్ని ఆక్రమించుకుందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. యూఎన్ ఆఫీస్ ఆఫ్ ద హై కమిషనర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ జమ్మూకశ్మీర్(కశ్మీర్ లోయ, జమ్మూ, లడఖ్ ప్రాంతాలు), పాకిస్తాన్ అడ్మినిస్టర్డ్ కశ్మీర్(ఆజాద్ జమ్ముకశ్మీర్, గిల్గిట్–బల్టిస్తాన్)లపై 49 పేజీల నివేదికను విడుదల చేసింది. మానవ హక్కుల ఉల్లంఘనలకు శిక్షలు పడకపోవడం, న్యాయం పొందే అవకాశం లేకపోవడం జమ్మూకశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలకు ఎదురవు తున్న సవాళ్లని ఐరాస తన నివేదికలో పేర్కొంది. అయితే పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)కు బదులుగా ఆజాద్ జమ్మూకశ్మీర్, గిల్గిట్ బల్టిస్తాన్ అనే పదాలను ఐరాస ఉపయోగించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత భూభాగం గురించి నివేదికలో తప్పుగా పేర్కొనడం తప్పుదారి పట్టించేలా ఉందని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, అసలు ఆజాద్ జమ్మూకశ్మీర్, గిల్గిత్ బల్టిస్తాన్ అనేవి లేనేలేవని పేర్కొంది. శాంతియుత కార్యకర్తలను అణచివేసేందుకు, వారిని హింసించేందుకు ఉగ్రవాద వ్యతిరేక చట్టాన్ని దుర్వినియోగం చేసే చర్యలను నిలిపివేయాలని ఐరాస పాకిస్తాన్‌ను కోరింది. 2016 నుంచి జమ్మూ కశ్మీర్లో చెలరేగిన ఆందోళనలు, భద్రతాదళాల చర్యలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదికను రూపొందించింది. -
ద్రోన్ దాడులకు పాకిస్థాన్ గ్రీన్‌సిగ్నల్!
ఐక్యరాజ్యసమితి/ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని అరాచక గిరిజన ప్రాంతాల్లో అమెరికా నిఘా సంస్థ సీఐఏ ద్రోన్ డాడులకు ఆ దేశ సైనిక ప్రభుత్వమే ఆమోదం తెలిపిందా? ఐక్యరాజ్యసమితి నివేదిక ఒకటి అవుననే సమాధానం ఇస్తోంది. ఇందుకు బలమైన సాక్ష్యాధారాలు కూడా ఉన్నట్లు ఆ నివేదిక కుండబద్ధలు కొడుతోంది. ఉగ్రవాదంపై పోరాటంలో మానవహక్కులు, ప్రాథమిక స్వేచ్ఛ పరిరక్షణ, ప్రోత్సాహంపై ఐక్యరాజ్యసమితి ప్రత్యేకంగా నియమించిన బెన్ ఎమ్మర్సన్ అధ్యయనం చేశారు. 2004-08 మధ్యకాలంలో పాక్ గిరిజన ప్రాంతాల్లో జరిగిన ద్రోన్ దాడులకు ఆ దేశ సైనిక ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వ ఆమోదం కూడా ఉందని తన నివేదికలో ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు 24 పేజీల నివేదికను ఆయన రూపొందించారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ఒబామాతో భేటీ అయిన పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ భూభాగంలో ద్రోన్ దాడులను ఆపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి దాడులకు పాక్ ప్రభుత్వమే అనుమతిచ్చిన విషయం వెలుగుచూసింది. ఒబామా, షరీఫ్‌ల భేటీ నేపథ్యంలో పాక్ గిరిజన ప్రాంతాల్లో ద్రోన్ దాడులు నిలిచిపోతాయని ఆ దేశం ఆశిస్తోంది. అంతర్జాతీయ నేర న్యాయస్థానం దృష్టికి ఈ దాడుల విషయం తీసుకెళ్లే అం శాన్ని పాక్ విదేశాంగ ప్రతినిధి తోసిపుచ్చారు.