
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పైకి రష్యా భారీ స్థాయిలో డ్రోన్ల దాడికి పాల్పడింది. 2022లో తమపై దురాక్రమణ మొదలయ్యాక రష్యా పాల్పడిన అతిపెద్ద డ్రోన్ దాడిగా ఉక్రెయిన్ మిలటరీ పేర్కొంది.
శనివారం ఉదయం రాజధానితోపాటు చుట్టుపక్కల ప్రాంతాలపైకి రష్యా ప్రయోగించిన 75 ఇరాన్ తయారీ షహీద్ డ్రోన్లలో 66 డ్రోన్లను కూల్చివేసినట్లు తెలిపింది. వేకువజామున 4 గంటలకు మొదలై దాదాపు ఆరు గంటలపాటు కొనసాగిన ఈ దాడుల్లో పలు భవనాలు ధ్వంసం కాగా 11 ఏళ్ల బాలుడు సహా అయిదుగురు పౌరులు గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment