AP Cabinet Meeting May, 2022 Key Decisions Full Details - Sakshi
Sakshi News home page

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్‌ భేటీ.. నిర్ణయాలు ఇవే..

Published Thu, May 12 2022 7:01 PM | Last Updated on Thu, May 12 2022 8:17 PM

AP Cabinet Meeting May 2022 Key Decisions Full Details - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ‍్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం ఏపీ కేబినెట్‌ భేటీ ముగిసింది. మీటింగ్‌ అనంతరం జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యవసాయానికి, ప్రాజెక్టులకు సంబంధించి కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. 

ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ..‘‘రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సాగునీరు ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం. గతేడాది కంటే ముందుగా వ్యవసాయ సీజన్‌ ప్రారంభించాలని, సాగుకు సరిపడా నీటిని నిల్వచేయాలని నిర్ణయం. ధవళేశ్వరం వద్ద డెడ్‌ స్టోరేజీని వినియోగించుకోవాలి. జూన్‌ 10 నుంచి కృష్ణా డెల్లా, పులిచింతల నీటి వినియోగం. జూన్‌ 30 నుంచి రాయలసీమ ప్రాజెక్టుల నీరు వినియోగం. నీటి వినియోగానికి సంబంధించి రైతులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని సీఎం జగన్‌ ఆదేశించారు’’ అని తెలిపారు.

ఈ క్ర‌మంలో రైతులు ఖ‌రీఫ్‌కు ముంద‌స్తు ఏర్పాట్లు చేసుకోవాల‌ని అంబ‌టి సూచించారు. ఖ‌రీఫ్ సీజ‌న్‌ను ముందే ప్రారంభిస్తే.. పంట కూడా ముందుగానే చేతికి వ‌స్తుంద‌ని ఆయ‌న తెలిపారు. న‌వంబ‌ర్‌లో తుఫానులు వ‌చ్చే నాటికే పంట చేతికి వ‌స్తుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ లెక్క‌న రైతులు కూడా మూడు పంట‌లు వేసుకునే వెసులుబాటు ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు. గ‌తంలో ప్రాజెక్టులు నిండాక ఆగ‌స్టులో నీరు విడుద‌ల చేసేవార‌ని, తాము మాత్రం ముందుగానే నీటిని విడుద‌ల చేయ‌నున్నామ‌ని అంబ‌టి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement