
Stock Market Updates: ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభ సమయానికి సెన్సెక్స్ 48 పాయింట్ల నష్టంతో 63,826 పాయింట్ల వద్ద, నఫ్టీ 4 పాయింట్ల క్షీణతతో 19,075 వద్ద కొనసాగుతున్నాయి.
బీపీసీఎల్, బజాబ్ ఆటో, హీరో మోటర్ కార్ప్, ఓఎన్‌జీసీ, మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీల షేర్లు టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, కోటక్ మహీంద్ర, భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల షేర్లు టాప్ లూజర్స్‌గా నష్టాల బాటలో పయనిస్తున్నాయి.
యూఎస్ ఫెడ్ నిర్ణయమే కీలకం
మార్కెట్ ప్రస్తుతం యూఎస్ ఫెడ్ వడ్డీ రేటు నిర్ణయం కోసం వేచి ఉంది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేటును బుధవారం రాత్రి ప్రకటించనుంది. మరోవైపు టాటా స్టీల్, సన్ ఫార్మా, బ్రిటానియా, హీరోమోటోకార్ప్ ఈరోజు తమ ఆదాయాలను నివేదించనున్నాయి. భారతి ఎయిర్‌టెల్, ఎల్‌అండ్‌టీ, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, జేఎస్‌పీఎల్ ఫలితాలపై కూడా మార్కెట్ ప్రతిస్పందన ఉండనుంది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)