దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ బెంచ్ మార్క్ స్టాక్ సూచీలు ట్రేడింగ్ సెషన్‌ను సానుకూలంగా ముగించాయి. ఎన్‌ఎస్‌సీ నిఫ్టీ 219.85 పాయింట్లు లేదా 0.99% లాభపడి 22,343.50 వద్ద స్థిరపడగా, బీఎస్‌ఈ సెన్సెక్స్ 655.04 పాయింట్లు లేదా 0.90% జంప్ చేసి 73,651.35 వద్దకు చేరుకుంది.
లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ స్టాక్‌లు లాభపడటంతో విస్తృత సూచీలు సానుకూలంగా ముగిశాయి. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 338.65 పాయింట్లు లేదా 0.72 శాతం పెరిగి 47,124.60 వద్ద స్థిరపడింది. మీడియా స్టాక్స్ నష్టాలను చూడగా ప్రభుత్వ బ్యాంకులు, ఆటో స్టాక్స్ ఇతర రంగాల సూచీల కంటే మెరుగైన పనితీరు కనబరిచాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment