దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మోస్తరు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.21 గంటల సమయంలో భారతీయ బెంచ్ మార్క్ సూచీలు బీఎస్‌ఈ సెన్సెక్స్ 328.04 పాయింట్లు లేదా 0.41% నష్టంతో 79,213.75 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 112.30 పాయింట్లు లేదా 0.46% నష్టపోయి 24,087.05 వద్ద చలిస్తున్నాయి.
ట్రెంట్, కోల్‌ఇండియా, బీపీసీల్, రిలయన్స్, టాటా మోటర్స్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. మరోవైపు ఐటీ షేర్లు మాత్రం లాభాల్లో కొనసాగుతున్నాయి. వీటిలో ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment