ముంబై ఇండియన్స్‌పై సీఎస్‌కే విజయం
ఐపీఎల్ 16వ సీజన్‌లో సీఎస్‌కే రెండు పరాజయాల తర్వాత మళ్లీ విజయాల బాట పట్టింది. శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 140 పరుగులు సాధారణ టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్‌కే 17.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.
డెవన్ కాన్వే 44 పరుగులు, రుతురాజ్ గైక్వాడ్ 30 పరుగులు చేసి ఔటవ్వగా.. ఆఖర్లో శివమ్ దూబే 18 బంతుల్లో 26 నాటౌట్ సీఎస్‌కేను గెలిపించాడు. ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా రెండు వికెట్లు తీయగా.. ట్రిస్టన్ స్టబ్స్, ఆకాశ్ మద్వాల్‌లు చెరొక వికెట్ తీశారు.
నాలుగో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే
గెలుపు వాకిట సీఎస్‌కే వరుసగా వికెట్లు కోల్పోతుంది. ఆకాశ్ మధ్వాల్ బౌలింగ్‌లో డెవాన్ కాన్వే (44) ఔటయ్యాడు. సీఎస్‌కే గెలుపుకు 20 బంతుల్లో 10 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి.
మూడో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే
అంబటి రాయుడు (*2) మరో మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ట్రిస్టన్ స్టబ్స్ బౌలింగ్‌లో రాఘవ్ గోయల్‌కు క్యాచ్ ఇచ్చి రాయుడు ఔటయ్యాడు. 14 ఓవర్ల తర్వాత సీఎస్‌కే స్కోర్ 119/3. కాన్వే (38), శివమ్ దూబే (13) క్రీజ్‌లో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే
సీఎస్‌కే రెండో వికెట్ కోల్పోయింది. పియూష్ చావ్లా బౌలింగ్‌లో రహానే (21) ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. 11 ఓవర్ల తర్వాత సీఎస్‌కే స్కోర్ 88/2. కాన్వే (29), రాయుడు (3) క్రీజ్‌లో ఉన్నారు.
టార్గెట్ 140.. తొలి వికెట్ కోల్పోయిన సీఎస్‌కే
ధాటిగా ఆడుతున్న రుతురాజ్.. 16 బంతుల్లో 30 పరుగులు చేసి ఔటయ్యాడు. ఐదో ఓవర్ తొలి బంతికి పియూష్ చావ్లా బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 5 ఓవర్ల తర్వాత సీఎస్‌కే స్కోర్ 50/1. కాన్వే (15), రహానే (3) క్రీజ్‌లో ఉన్నారు.
టార్గెట్ 140.. రుతురాజ్ గైక్వాడ్ ఊచకోత
140 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో సీఎస్‌కే ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. కాన్వే (10) ఆచితూచి ఆడుతుంటే.. రుతురాజ్ గైక్వాడ్ (30) ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఫలితంగా సీఎస్‌కే 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 46 పరుగులు చేసింది.
స్వల్ప స్కోర్‌కే పరిమితమైన ముంబై.. చెన్నై టార్గెట్ ఎంతంటే..?
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై.. సీఎస్‌కే బౌలర్ల ధాటికి స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. మతీష పతిరణ 3 వికెట్లతో ముంబై పతనాన్ని శాసించగా.. దీపక్ చాహర్, తుషార్ తలో 2 వికెట్లు, జడేజా ఓ వికెట్ పడగొట్టారు. నేహల్ వధేరా (64) హాఫ్ సెంచరీతో రాణించడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ముంబై ఇన్నింగ్స్‌లో నేహల్‌తో పాటు సూర్యకుమార్ (26), ట్రిస్టన్ స్టబ్స్ (20) రెండంకెల స్కోర్‌తో రాణించారు.
ఎనిమిదో వికెట్ కోల్పోయిన ముంబై
137 పరుగుల వద్ద ముంబై ఎనిమిదో వికెట్ కోల్పోయింది. పతిరణ బౌలింగ్‌లో ట్రిస్టన్ స్టబ్స్ (20) ఔటయ్యాడు. అంతకుముందు ఇదే ఓవర్‌లో అర్షద్ ఖాన్ (1) ఔటయ్యాడు.
ముంబై నాలుగో వికెట్ డౌన్
69 పరుగుల వద్ద ముంబై నాలుగో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ (26) క్లీన్ బౌల్డయ్యాడు. ట్రిస్టన్ స్టబ్స్, నేహల్ (27) క్రీజ్‌లో ఉన్నారు.
రోహిత్ శర్మ మరోసారి డకౌట్.. ముంబై స్కోర్ 16/3
ఐపీఎల్‌లో రోహిత్ శర్మ రికార్డు స్థాయిలో 16వ సారి డకౌటయ్యాడు. దీపక్ చాహర్ బౌలింగ్‌లో హిట్‌మ్యాన్ ఔటయ్యాడు. 3 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 16/3. సూర్యకుమార్, నేహల్ వధేరా క్రీజ్‌లో ఉన్నారు.
13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ముంబై
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీపక్ చాహర్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ (7) ఔటయ్యాడు.
తొలి వికెట్ కోల్పోయిన ముంబై.. గ్రీన్ ఔట్
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై.. రెండో ఓవర్‌లోనే వికెట్ కోల్పోయింది. తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో గ్రీన్ (6) క్లీన్‌బౌల్డయ్యాడు. 2 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 13/1. రోహిత్, ఇషాన్ కిషన్ (7) క్రీజ్‌లో ఉన్నారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై
ఐపీఎల్-2023లో భాగంగా ఇవాళ (మే 6) మధ్యాహ్నం 3: 30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఆసక్తికరమైన మ్యాచ్ జరుగనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
తుది జట్లు..
సీఎస్‌కే: ఎంఎస్ ధోని, రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్య రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, మతీష పతిరణ, తుషార్ దేశ్‌పాండే.
ముంబై: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, ట్రిస్టన్ స్టబ్స్, సూర్యకుమార్ యాదవ్, కెమారూన్ గ్రీన్, టిమ్ డేవిడ్, నేహల్ వధేరా, జోఫ్రా ఆర్చర్, పియూష్ చావ్లా, ఆకాశ్ మధ్వాల్, ఆర్షద్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment