► ఇతర రాష్ట్రాలతో తెలంగాణకు కనెక్టివిటీ పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రధాని మోదీ చెప్పారు. పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారని అన్నారు. కాగా.. 3,441 కోట్లతో మంచిర్యాల-వరంగల్ జాతీయ రహదారిని నిర్మించనున్నారు. రూ. 2,147 కోట్ల వ్యయాన్ని జగిత్యాల-కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారికి కేటాయించనున్నారు.రూ. 521 కోట్లను కాజీపేట రైల్వే వ్యాగన్‌కు వినియోగించనున్నారు. కొత్త రహదారులతో పర్యటకానికి ప్రోత్సాహం చేకూరుతుందని ప్రధాని మోదీ చెప్పారు. 9 ఏళ్లలో తెలంగాణలో 2 వేల కిలోమీటర్ల జాతీయ రహదాలును విస్తరించగా.. 5 వేల కిలోమీటర్ల విస్తరణకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు.
► తెలంగాణ ఆర్థిక కేంద్రంగా మారబోతోందని ప్రధాని మోదీ అన్నారు. కాజీపేట రైల్యే వ్యాగన్ యూనిట్‌కు మోదీ శంకుస్థాపన చేశారు. మేకిన్ ఇండియాలో భాగంగా కాజీపేటలో రైల్వే వ్యాగన్‌ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నాగ్‌పూర్- విజయవాడ ఎకనామిక్ కారిడార్‌తో తెలంగాణ ప‍్రజలకు ఉపయోగం కలుగుతుందని స్పష్టం చేశారు.
► విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ మేరకు ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. దేశ అభివృద్ధిలో తెలంగాణ ప్రజల పాత్ర గొప్పదని ప్రధాని మోదీ అన్నారు. 6 వేల కోట్లతో కొత్త జాతీయ రహదారులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 176 కిలోమీటర్ల జాతీయ రహదారులకు పునాది రాయి వేశారు మోదీ.
► వరంగల్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన విజయ్ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. గవర్నర్ తమిళి సై, నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వేదికపై కూర్చున్నారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ సర్కార్ కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి చెప్పారు.
► వరంగల్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ రోడ్డు మార్గం ద్వారా భద్రకాళీ ఆలయాన్ని చేరుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ప్రధానికి స్వాగతం పలికారు. ప్రధాని మోదీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అటు నుంచి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి చేరుకోనున్నారు.
► ఓరుగల్లు పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ వరంగల్‌కు చేరుకున్నారు. మామునూరు ఎయిర్‌పోర్టులో దిగారు. కాసేపట్లో భద్రకాళీ అమ్మవారి ఆలయానికి చేరుకోనున‍్నారు.
► వరంగల్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేట విమానశ్రయంలో దిగారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో వరంగల్ చేరుకోనున్నారు. అనంతరం భద్రకాళీ అమ్మవారిని దర్శించుకోనున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. 3,500 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటల నుంచే వరంగల్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
► ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు పర్యటించనున్నారు. ఇప్పటికే ఢిల్లీ నుంచి వరంగల్‌కు బయలుదేరినట్లు ట‍్విట్టర్ వేదికగా తెలిపారు. రూ.6100 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు, హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు.
Leaving for Warangal to attend a programme where we will inaugurate or lay the foundation stone for development works worth over Rs. 6100 crores. These works cover different sectors ranging from highways to railways. They will benefit the people of Telangana.
— Narendra Modi (@narendramodi) July 8, 2023
ఇదీ చదవండి: పొలిటికల్ ట్రాక్‌పైనే.. పోరుగల్లు వ్యాగన్స్!
అధికారిక సమాచారం మేరకు ప్రధాని మోదీ పర్యటన వివరాలిలా ఉన్నాయి..
♦ శనివారం ఉదయం 7–35 గంటలకు వారణాసి ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరుతారు.
♦ 9–25 గంటలకు హకీంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
♦ 9–30 గంటలకు ఎంఐ–17 హెలికాప్టర్‌లో హకీంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి వరంగల్‌కు బయలుదేరతారు.
♦10–15 గంటలకు మామ్నూర్‌లోని హెలిపాడ్‌కు చేరుకుని, రోడ్డుమార్గాన భద్రకాళి ఆలయానికి బయలుదేరతారు.
♦ 10–30 గంటల నుంచి 10–50 గంటల వరకు ఆలయంలో పూజల అనంతరం హనుమకొండలోనిఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్‌కు బయలుదేరతారు.
♦ 11–00 గంటలకు అక్కడికి చేరుకుని 11–35 గంటల వరకు వివిధ అభివృధ్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
♦ 11–40 గంటలకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్‌లోని బహిరంగ సభ వేదికకు బయలుదేరి 11–45 గంటలకు అక్కడికి చేరుకుంటారు.
♦ 11–45 నుంచి 12–20 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు.
♦ 12–20 నుంచి 12–30 గంటల వరకు విశ్రాంతి. అనంతరం రోడ్డు మార్గాన బయలుదేరి 12–50 గంటలకు హెలిపాడ్‌కు చేరుకుంటారు.
♦ 12–55 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 1–40 గంటలకు హకీంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
♦ 1–45 గంటలకు ప్రత్యేక విమానంలో రాజస్థాన్‌లోని బికనీర్‌కు వెళతారు.
ఇదీ చదవండి: వరంగల్ పర్యటన: మోదీ సభా వేదికపై ఎనిమిది మందే.. ఎవరెవరంటే?
Comments
Please login to add a commentAdd a comment