Breadcrumb
India Vs South Africa: ఉత్కంఠ భరిత పోరులో భారత్ ఓటమి.. వరల్డ్‌కప్ నుంచి ఔట్
Published Sun, Mar 27 2022 6:17 AM | Last Updated on Sun, Mar 27 2022 2:05 PM
Live Updates
Womens WC 2022: ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా లైవ్అప్డేట్స్
ఉత్కంఠ భరిత పోరులో భారత్ ఓటమి
ఉత్కంఠ భరిత పోరులో భారత్‌పై మూడు వికెట్లు తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. దీంతో వరల్డ్‌కప్ నుంచి భారత్ ఇంటిమఖం పట్టింది. దీప్తి శర్మ వేసిన అఖరి ఓవర్లో 7 పరుగుల కావల్సిన నేపథ్యంలో.. తొలి రెండు బంతులకి రెండు పరుగులు రాగా, మూడో బంతికి డుప్రీజ్ క్యాచ్ ఇచ్చింది. అయితే ఆది నో బాల్‌గా తేలడంతో మ్యాచ్ స్వూరూపమే మారిపోయింది. అఖరి బంతికి ఒక్క పరుగు కావల్సిన నేపథ్యంలో డుప్రీజ్ ఫోర్ బాది దక్షిణాఫ్రికాను గెలిపించింది.
275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే ఓపెనర్ లీ వికెట్‌ను కోల్పోయింది. అనంతరం వొల్వార్డ్, లారా గుడాల్ రెండో వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. లారా గుడాల్‌ను ఔట్ చేసి రాజేశ్వరి గైక్వాడ్ భాగస్వామ్యాన్నిబ్రేక్ చేసింది.
అనంతరం హర్మన్‌ప్రీత్ కౌర్.. వొల్వార్డ్ను బౌల్డ్ చేయడంతో మ్యాచ్ భారత్ వైపు మలుపు తిరిగింది. తర్వాత డుప్రీజ్, కాప్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో హర్మన్‌ప్రీత్,రాజేశ్వరి గైక్వాడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుమంందు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన(71), షఫాలీ వర్మ(53), కెప్టెన్ మిథాలీ రాజ్(68), వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్ 48 పరుగులతో రాణించారు.
ఐదో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా
దక్షిణాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. 32 పరుగులు చేసిన కాప్ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరింది. దక్షిణాఫ్రికా విజయానికి 30 బంతుల్లో 45 పరుగులు కావాలి.
నాలుగో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా
భారత్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన సునే లూస్.. హర్మాన్ ప్రీత్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగింది. దక్షిణాఫ్రికా విజయానికి 78 బంతుల్లో 92 పరుగులు కావాలి. భారత్ విజయానికి 6 వికెట్ల దూరంలో నిలిచింది.
నిలకడగా ఆడుతున్న దక్షిణాఫ్రికా..
భారత్‌తో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నిలకడగా ఆడుతోంది. 35 ఓవర్లలో దక్షిణాఫ్రికా స్కోరు: 177-3. మిగ్నన్ డుప్రిజ్, కెప్టెన్ సునె లస్ క్రీజులో ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా
వొల్వార్డ్ రూపంలో దక్షిణాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. హర్మన్‌ప్రీత్ కౌర్ బౌలింగ్‌లో బౌల్డ్ అయి పెవిలియన్ చేరింది. 28 ఓవర్లలో దక్షిణాఫ్రికా స్కోరు: 145-3
రెండో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా
125 పరుగుల భాగస్వామ్యానికి రాజేశ్వరి గైక్వాడ్ బ్రేక్ వేసింది. లారా గుడాల్ స్టౌంప్ ఔట్ రూపంలో పెవిలియన్‌కు చేరింది. 27 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 139/2
జోరు మీదున్న దక్షిణాఫ్రికా
26 ఓవర్లలో దక్షిణాఫ్రికా స్కోరు: 137-1
దంచికొడుతున్న దక్షిణాఫ్రికా
సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్‌ను దక్షిణాఫ్రికా కష్టాల్లోకి నెట్టేసింది. ఆదిలో రనౌట్ తప్ప మిథాలీ సేనకు ఇంతవరకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ప్రొటిస్ ఓపెనర్ లారా వొల్వార్డ్ 66 పరుగులతో ధాటిగా ఆడుతోంది. ఆమెతో పాటు లారా 36 పరుగులతో క్రీజులో ఉంది. దీంతో భారత అభిమానులు ఉసూరుమంటున్నారు.
21 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా స్కోరు: 114-1
ధాటిగా ఆడుతున్న దక్షిణాఫ్రికా
భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ధాటిగా ఆడుతోంది. ఆరంభంలోనే స్టార్ బ్యాటర్ లిజెలీ లీ వికెట్ కోల్పోయినా... మరో ఓపెనర్ లారా వొల్వార్డ్తో అర్ధ శతకంతో రాణించింది. వన్‌డౌన్‌లో వచ్చిన లారా ఆమెకు సహకారం అందిస్తూ ముందుకు సాగుతోంది.
స్కోరు: 15 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా స్కోరు 81-1
నిలకడగా ఆడుతున్న దక్షిణాఫ్రికా
పది ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా స్కోరు: 50/1 (10)
తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా
భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ లిజెలీ లీ రనౌట్‌గా వెనుదిరిగింది.
ప్రస్తుత స్కోరు: 14/1 (5)
దంచికొట్టిన భారత్.. స్కోరు ఎంతంటే!
ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీ దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో మిథాలీ సేన మెరుగైన స్కోరు సాధించింది. ఓపెనర్లు స్మృతి మంధాన(71), షఫాలీ వర్మ(53), కెప్టెన్ మిథాలీ రాజ్(68) అర్ధ సెంచరీలతో మెరవగా, వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్ 48 పరుగులతో రాణించింది. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని విధించింది.
అయ్యో హర్మన్.. హాఫ్ సెంచరీ మిస్
అర్ధ శతకానికి చేరువలో ఉన్న భారత వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అవుట్ అయింది. 48 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించింది. ఖాకా బౌలింగ్‌లో బౌల్డ్ అయింది.
ఆరో వికెట్ కోల్పోయిన భారత్
భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. దక్షిణాఫ్రికా బౌలర్ ఇస్మాయిల్ బౌలింగ్‌లో రిచా ఘోష్ వెనుదిరిగింది. కెప్టెన్ సునే లస్ అద్భుత క్యాచ్‌తో ఆమెను పెవిలియన్‌కు పంపింది.
స్కోరు: 269/6 (48.3)
ఐదో వికెట్ కోల్పోయిన భారత్
240 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. మూడు పరుగులు చేసిన వస్త్రకర్.. ఇస్మాయిల్ బౌలింగ్‌లో సన్నీ లూస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకుంది.
భారీ స్కోర్ దిశగా భారత్..
234 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 68 పరుగులు చేసిన మిథాలీ.. మసాబాటా క్లాస్ బౌలింగ్‌లో ట్రాయన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరింది. కాగా ఈ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. 44 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది.
మూడో వికెట్ కోల్పోయిన భారత్.. మంధాన ఔట్
176 పరుగుల వద్ద మంధాన(71) రూపంలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 39 ఓవర్లు ముగిసేసరికి భారత్ మూడు వికెట్లు నష్టానికి 214 పరుగులు చేసింది. క్రీజులో మిథాలీ రాజ్(61), హర్మన్ ప్రీత్(17) పరుగులతో ఉన్నారు.
28 ఓవర్లకు భారత్ స్కోర్: 146/2
28 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్: 148/2. క్రీజులో మిథాలీ రాజ్(23), మంధాన(60) పరుగులతో క్రీజులో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన భారత్
టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. కేవలం రెండు పరుగులు మాత్రమే చేసిన యస్తిక.. ట్రయాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యింది.
తొలి వికెట్ కోల్పోయిన భారత్.. షెఫాలీ వర్మ ఔట్
91 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 53 పరుగులు చేసి మంచి టచ్‌లో కనిపించిన షెఫాలీ వర్మ రనౌట్ పెవిలియన్‌కు చేరింది. 16 ఓవర్లకు భారత్ స్కోర్: 93/1
నిలకడగా ఆడుతున్న భారత్.. 10 ఓవర్లకు 68/0
10 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 68 పరుగులు చేసింది. క్రీజులో షెఫాలీ వర్మ(46), స్మృతి మందాన(17) పరుగులతో క్రీజులో ఉన్నారు.
నిలకడగా బ్యాటింగ్ చేస్తోన్న టీమిండియా
మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీలో నిలవాలంటే తప్పక గెలలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. ఎనిమిది ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 49 పరుగులు చేసింది. స్మృతి మంధనా 24 బంతుల్లో 11 పరుగులు చేయగా, షెఫాలీ వర్మ ధాటిగా ఆడుతూ 25 బంతుల్లోనే 34 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీలో చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
భారత్‌కు తాడో పేడో!
క్రైస్ట్‌చర్చ్: మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు ప్రస్థానం ముందుకు సాగుతుందో లేదో నేడు తేలిపోనుంది. టోర్నీ చివరి లీగ్ మ్యాచ్‌లో నేడు దక్షిణాఫ్రికాతో మిథాలీ రాజ్ బృందం తలపడనుంది. భారత్ సెమీఫైనల్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలి. వెల్లింగ్టన్లో జరిగే మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో ఇంగ్లండ్ తలపడుతుంది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ సెమీఫైనల్‌కు చేరాలంటే ఆ జట్టూ తప్పనిసరిగా విజయం సాధించాలి.
ఈ టోర్నీలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న దక్షిణాఫ్రికాను ఓడించాలంటే భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. బ్యాటింగ్‌లో స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యస్తిక భాటియా, కెప్టెన్ మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్, స్నేహ్ రాణా మెరిస్తేనే భారత్‌కు భారీ స్కోరు సాధ్యమవుతుంది. అనంతరం బౌలింగ్‌లో జులన్ గోస్వామి, పూజ వస్త్రకర్, స్పిన్నర్లు రాజేశ్వరి గైక్వాడ్ ప్రత్యర్థిని కట్టడి చేయడంపైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
ఓవరాల్‌గా దక్షిణాఫ్రికాతో భారత్ ఇప్పటి వరకు 27 వన్డేల్లో తలపడింది. 15 మ్యాచ్‌ల్లో గెలిచి, 11 మ్యాచ్‌ల్లో ఓడింది. మరో మ్యాచ్ రద్దయింది. ఇక ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో నాలుగుసార్లు ఆడిన భారత్ మూడుసార్లు నెగ్గి ఒకసారి ఓడిపోయింది.
ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఇప్పటికే సెమీస్ చేరగా... మిగతా రెండు బెర్త్‌ల కోసం వెస్టిండీస్ (7 పాయింట్లు), భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ (6 పాయింట్లు చొప్పున) రేసులో ఉన్నాయి.
Related News By Category
Related News By Tags
-
చెలరేగిన పేసర్లు.. సౌతాఫ్రికాపై టీమిండియా చారిత్రక విజయం
South Africa Vs India 2nd Test 2024 Day 2 Updates- కేప్‌టౌన్: చెలరేగిన పేసర్లు.. సౌతాఫ్రికాపై టీమిండియా చారిత్రక విజయం కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సా...
-
IND VS SA 2nd Test: తొలి రోజే 23 వికెట్లు.. ఇంకా ఆధిక్యంలోనే టీమిండియా
South Africa Vs India 2nd Test 2024 Day 1 Updates- కేప్‌టౌన్: తొలి రోజే 23 వికెట్లు.. ఇంకా ఆధిక్యంలోనే టీమిండియా రెండో టెస్ట్‌లో తొలి రోజే 23 వికెట్లు నేలకూలాయి. ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్‌ల్లో ఆల...
-
సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా.. సిరీస్ కైవసం
సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా.. సిరీస్ కైవసం నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా సౌతాఫ్రికాను చిత్తు చేసి 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సంజూ శాంసన్ సెం...
-
చెలరేగిన హర్షల్, చహల్.. మూడో టీ20లో టీమిండియా ఘన విజయం
సత్తా చాటిన భారత బౌలర్లు.. మూడో టీ20లో టీమిండియా ఘన విజయం భారత బౌలర్లు హర్షల్ పటేల్ (4/25), చహల్ (3/20) సత్తా చాటడంతో దక్షిణాఫ్రికాతో జరిగిన కీలకమైన మూడో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. టాస్...
-
ఓటమిని తట్టుకోవడం కష్టమే.. అయితే: విరాట్ కోహ్లి ట్వీట్ వైరల్
Virat Kohli Message: టీ20 ప్రపంచకప్-2021లో దాయాది పాకిస్తాన్ చేతిలో కనీవినీ ఎరుగని ఓటమి.. కనీసం సెమీస్ కూడా చేరకుండానే మెగా టోర్నీ నుంచి నిష్క్రమణ.. అప్పటి టీమిండయా సారథి విరాట్ కోహ్లికి చేదు అనుభ...
Comments
Please login to add a commentAdd a comment